జయలలిత కేసులో 12న తుది తీర్పు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసులో తుది తీర్పు ఈ నెల 12న వెలువడే అవకాశముంది. దీనిపై 11వ తేదీ కర్ణాటక కోర్టులో తుది విచారణ జరుగుతుంది. అక్రమ ఆస్తుల కేసులో దోషిగా నిర్దారిస్తూ జయలలితకు గతంలో కర్ణాటక సెషన్స్ కోర్టు నాలుగేళ్ళ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీన్ని సుప్రీంకోర్టులో జయలలిత తరఫు న్యాయవాదులు సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కర్ణాటక సెషన్స్ కోర్టు తీర్పును నిలిపి వేస్తూ జయకు […]
Advertisement
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసులో తుది తీర్పు ఈ నెల 12న వెలువడే అవకాశముంది. దీనిపై 11వ తేదీ కర్ణాటక కోర్టులో తుది విచారణ జరుగుతుంది. అక్రమ ఆస్తుల కేసులో దోషిగా నిర్దారిస్తూ జయలలితకు గతంలో కర్ణాటక సెషన్స్ కోర్టు నాలుగేళ్ళ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీన్ని సుప్రీంకోర్టులో జయలలిత తరఫు న్యాయవాదులు సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కర్ణాటక సెషన్స్ కోర్టు తీర్పును నిలిపి వేస్తూ జయకు బెయిల్ మంజూరు చేసింది. మళ్ళీ ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు ఈనెల 12వ తేదీలోగా వెలువరించాల్సిందిగా సుప్రీంకోర్టు కర్ణాటక కోర్టుకు సూచించడంతో 11న కేసు విచారణకు వస్తుంది. 12న తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది.
Advertisement