జర నవ్వండి ప్లీజ్ 77
టీచర్ : మనం పగటిపూట ఆక్సిజన్ పీలిస్తే నైట్ టైం ఏం పీలుస్తాం? సూరజ్: నైట్రోజన్! —————————— రవి: మా కుక్కకు తోక లేదు! స్నేహితుడు: మరి అది సంతోషంగా వుందని ఎలా తెలుసుకుంటావు? రవి: నన్ను కరవకుండా వున్నప్పుడు. —————————— జడ్జి: సాక్ష్యాల్ని బట్టి నువ్వు ఆ డబ్బు దొంగిలించలేదని నిర్ణయించి నిన్ను నిర్దోషిగా విడుదల చేస్తున్నాను. ముద్దాయి: థాంక్స్ సర్! మరి ఆ డబ్బును నన్నే వుంచుకోమంటారా? —————————— గదిలో అద్దెకుంటున్న అతను యజమాని […]
టీచర్ : మనం పగటిపూట ఆక్సిజన్ పీలిస్తే నైట్ టైం ఏం పీలుస్తాం?
సూరజ్: నైట్రోజన్!
——————————
రవి: మా కుక్కకు తోక లేదు!
స్నేహితుడు: మరి అది సంతోషంగా వుందని ఎలా తెలుసుకుంటావు?
రవి: నన్ను కరవకుండా వున్నప్పుడు.
——————————
జడ్జి: సాక్ష్యాల్ని బట్టి నువ్వు ఆ డబ్బు దొంగిలించలేదని నిర్ణయించి నిన్ను నిర్దోషిగా విడుదల చేస్తున్నాను.
ముద్దాయి: థాంక్స్ సర్! మరి ఆ డబ్బును నన్నే వుంచుకోమంటారా?
——————————
గదిలో అద్దెకుంటున్న అతను యజమాని దగ్గరికెళ్ళి “వారం నించీ చెబుతున్నాను. గోడకు పెద్ద అద్దం ఎప్పుడు ఫిక్స్ చేస్తారు?”
“చిన్ని అద్దముంది కదండీ?” అన్నాడు యజమాని.
“వుంది కానీ దానివల్ల ప్రయోజనం లేదు. నా బాధ అర్థం చేసుకోండి. ఇప్పటికి మూడుసార్లు ప్యాంటు వేసుకోకుండా ఆఫీసుకెళ్ళాను.”