హిరణ్యాక్షుడు (FOR CHILDREN)

          భూమి గుండ్రంగా వుందా? బల్లపరుపుగా వుందా? ఎలావుందో మీకు తెలుసు.           అయితే భూమిని చాప చుట్టినట్టు చుట్టడం సాధ్యమేనా? అలా చుట్టిన వాళ్ళెవరైనా వున్నారా?           ఉన్నారు!           హిరణ్యాక్షుడు!           భూమిని చాప చుట్టినట్టు చుట్టడమే కాదు, అలా చుట్టిన భూమిని పాతాళంలోకి తొయ్యాలని, పడదొయ్యాలని చూసాడు హిరణ్యాక్షుడు. అప్పుడేమయ్యిందో తెలుసుకొనే ముందు హరిణ్యాక్షుడి కథ తెలుసుకుందాం!           హరిణ్యాక్ష హిరణ్యకశిపులిద్దరూ రాక్షస సోదరులు. “దితి” వీరి తండ్రి. దేవతలనే కాదు ముల్లోకాలను […]

Advertisement
Update:2015-05-07 01:49 IST

భూమి గుండ్రంగా వుందా? బల్లపరుపుగా వుందా? ఎలావుందో మీకు తెలుసు.

అయితే భూమిని చాప చుట్టినట్టు చుట్టడం సాధ్యమేనా? అలా చుట్టిన వాళ్ళెవరైనా వున్నారా?

ఉన్నారు!

హిరణ్యాక్షుడు!

భూమిని చాప చుట్టినట్టు చుట్టడమే కాదు, అలా చుట్టిన భూమిని పాతాళంలోకి తొయ్యాలని, పడదొయ్యాలని చూసాడు హిరణ్యాక్షుడు. అప్పుడేమయ్యిందో తెలుసుకొనే ముందు హరిణ్యాక్షుడి కథ తెలుసుకుందాం!

హరిణ్యాక్ష హిరణ్యకశిపులిద్దరూ రాక్షస సోదరులు. “దితి” వీరి తండ్రి. దేవతలనే కాదు ముల్లోకాలను ముచ్చెమటలు పట్టించగల ధీరులు. శూరులు. కాని కౄరులు కూడా అయినారు.

దేవ దానవులకు వైరం ఎలానూ వుండనే వుంది.

అన్నట్టు ఈ హిరాణ్యాక్ష హిరణ్యకశిపులు ఇద్దరూ జయ విజయులని విష్ణుమూర్తి దగ్గర ద్వార పాలకులు. ఎప్పుడూ? -ముందు జన్మలో. మరి ఎందుకని ఇలా శాపగ్రస్తులయ్యారూ? ద్వారపాలకులుగా ఉన్నరోజుల్లో సనక-సునందన-సనత్కుమార-సనత్సు జాతులనే బ్రహ్మ మానసపుత్రులు అయిదారేళ్ళ వయసుగలిగి దిగంబరులై ముల్లోకాల్లో తిరుగుతూ విష్ణుమూర్తి దర్శనంకోసం వైకుంఠానికి వచ్చారు. జయ విజయులు అడ్డుకోవడంతో “భూలోకంలో రాక్షసులై జన్మింతురుగాక!” అని శపించారు. దాని పర్యవసాన ఫలితమేయిది. మూడు జన్మల వరకూ విష్ణువుతో వైరం. నాల్గవ జన్మలో విష్ణు పథం చేరడం. ఆవైరంలో భాగమే – రాక్షస చర్య. భూమిని చుట్టి పాతాళంలో పడెయ్యడం అందుకే –

పాతాళంలోకే ఎందుకు పడేశాడూ? పాతాళంలో విష్ణుమూర్తి యజ్ఞ వరాహ రూపంలో వున్నాడు. ఈ విషయం నారదుని ద్వారా హిరణ్యాక్షునికి తెలిసింది. అందుకే ఆ పని చేసాడు. అయితే భూమి పాతాళంలో పడిపోకుండా వరాహం తన మోరతో భూమిని ఎత్తి పట్టుకొని కాపాడింది. అంతేకాదు, హిరాణ్యాక్షుని తన కోరలతో కుమ్మి చీల్చి చంపింది వరాహం!

వరాహం అంటే తెలుసు కదా… పంది!

అర్థమయింది కదా రూపం కాదు, సారం ముఖ్యం!.

– బమ్మిడి జగదీశ్వరరావు

Tags:    
Advertisement

Similar News