జర నవ్వండి ప్లీజ్ 72
డాక్టర్: గుడ్‌మార్నింగ్ కృష్ణారావుగారు! ఏమిటి కనిపించి ఐదారు నెలలయింది? ఏమయ్యారు? కృష్ణారావు: ఆరోగ్యం బాగాలేక మీ దగ్గరకు రాలేదు డాక్టర్‌గారు! ——————————- మోహన్: వంశీ! నిన్ననే ఒక కుక్కను కొన్నాం. దాంతో ఆడుకుందాం, వస్తావా? వంశీ: నిన్ననే కొన్నారా? అదేమన్నా కరుస్తుందా? మోహన్: ఆ సంగతి తెలీదు. అందుకే కదా నిన్ను రమ్మంటున్నది. ——————————- బస్టాప్‌లో ప్రయాణికుడు చిరాకుగా “ఈ బస్ కోసం ఎంతసేపు ఎదురు చూడాలి?” మరో ప్రయాణికుడు “అది వచ్చేదాకా” అన్నాడు తాపీగా. ——————————- […]
డాక్టర్: గుడ్‌మార్నింగ్ కృష్ణారావుగారు! ఏమిటి కనిపించి ఐదారు నెలలయింది? ఏమయ్యారు?
కృష్ణారావు: ఆరోగ్యం బాగాలేక మీ దగ్గరకు రాలేదు డాక్టర్‌గారు!
——————————-
మోహన్: వంశీ! నిన్ననే ఒక కుక్కను కొన్నాం. దాంతో ఆడుకుందాం, వస్తావా?
వంశీ: నిన్ననే కొన్నారా? అదేమన్నా కరుస్తుందా?
మోహన్: ఆ సంగతి తెలీదు. అందుకే కదా నిన్ను రమ్మంటున్నది.
——————————-
బస్టాప్‌లో ప్రయాణికుడు చిరాకుగా “ఈ బస్ కోసం ఎంతసేపు ఎదురు చూడాలి?”
మరో ప్రయాణికుడు “అది వచ్చేదాకా” అన్నాడు తాపీగా.
——————————-
టీచర్: రాధా! భూమి గుండ్రంగా ఉందని నువ్వెలా నిరూపిస్తావు?
రాధ: నేనెప్పుడూ అలా చెప్పలేదు టీచర్!
——————————-
నరేష్: టీచర్! మీరు చెయ్యని తప్పుకు శిక్షిస్తారా?
టీచర్: అలా ఎందుకు చేస్తాను? ఎప్పుడూ అలా చెయ్యను.
నరేష్: నిజమే టీచర్? మీరు చాలా మంచివారు. నాకు తెలుసు, నేను మీరు నిన్న ఇచ్చిన హోంవర్కు చెయ్యలేదు.