మేలు చేసే ముల్లంగి
మార్కెట్‌లలో పుష్కలంగా దొరికే ముల్లంగితో అనేక ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. దీనిని కూరల్లో, సాంబారులో, సలాడ్లలో ఎలా తీసుకున్నా శరీరానికి మేలు చేసే పోషకాలెన్నో అందుతాయి. – మహిళలకు మూత్ర సంబంధ సమస్యలు తరచుగా తలెత్తుతుంటాయి. అలాంటి వారు ముల్లంగిని తరచుగా తీసుకోవడం మంచిది. మూత్ర సమస్యలు, మంట, వాపు వంటివి అదుపులో ఉంటాయి. – మూత్రపిండాల్లోని ఇన్‌ఫెక్షన్‌ను దూరం చేయడమే కాదు వ్యర్థాలను మూత్రం ద్వారా వెళ్లిపోయేలా చేస్తుంది. – బరువుతగ్గాలనుకునేవారికి ముల్లంగి […]
Advertisement
మార్కెట్‌లలో పుష్కలంగా దొరికే ముల్లంగితో అనేక ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. దీనిని కూరల్లో, సాంబారులో, సలాడ్లలో ఎలా తీసుకున్నా శరీరానికి మేలు చేసే పోషకాలెన్నో అందుతాయి.
– మహిళలకు మూత్ర సంబంధ సమస్యలు తరచుగా తలెత్తుతుంటాయి. అలాంటి వారు ముల్లంగిని తరచుగా తీసుకోవడం మంచిది. మూత్ర సమస్యలు, మంట, వాపు వంటివి అదుపులో ఉంటాయి.
– మూత్రపిండాల్లోని ఇన్‌ఫెక్షన్‌ను దూరం చేయడమే కాదు వ్యర్థాలను మూత్రం ద్వారా వెళ్లిపోయేలా చేస్తుంది.
– బరువుతగ్గాలనుకునేవారికి ముల్లంగి భేషైన ఔషధం. ఇందులో పీచు అధికం. క్యాలరీలు తక్కువ.
– ముల్లంగిని కొంచెం తీసుకున్నా కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది.
– ముల్లంగిలో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇది మలబద్దకం వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. జీవ క్రియల రేటును వృద్ధి చేస్తుంది.
– ముల్లంగిలో విటమిన్ సి ఫోలిక్ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి.
– ముల్లంగిలో ఎక్కువగా ఉండే యాంటి ఆక్సిడెంట్లు శరీరంలో క్యాన్సర్లకు కారణమయ్యే కారకాలతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి.
– శరీరానికి మేలు చేసే కొత్త కణాల ఉత్పత్తికి ముల్లంగి తోడ్పడుతుంది.
– ముల్లంగిని తరచుగా తీసుకునేవారికి అల్సర్ సమస్య తగ్గిపోతుంది. శరీరంలో రక్త ప్రసరణ చురుగ్గా ఉంటుంది.
– ముల్లంగితో చర్మ సంబంధమైన సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
– ముల్లంగిలో ఉండే విటమిన్ బి, జింక్, ఫాస్పరస్, నీరు చర్మం నిర్జీవంగా మారకుండా కాపాడతాయి.
Advertisement