సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘టిప్పు’

నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో వుంటూ పంపిణీ రంగంలో విశేషానుభవాన్ని సంపాదించి ఎన్నో సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రాలను వైజాగ్‌ ఏరియాలో పంపిణీ చేసి సక్సెస్‌ఫుల్‌ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగి వైజాగ్‌ రాజుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు సత్యకార్తీక్‌ను ‘టిప్పు’ చిత్రం ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారు. చిన్నప్పటి నుండి సినిమాలను చూస్తూ, సినిమాల పట్ల ఆసక్తిని పెంచుకుని ఎప్పటికైనా హీరో కావాలని కకలు కన్న సత్యకార్తీక్‌ తను కలలు కన్న సినిమా […]

Advertisement
Update:2015-04-29 10:20 IST
నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో వుంటూ పంపిణీ రంగంలో విశేషానుభవాన్ని సంపాదించి ఎన్నో సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రాలను వైజాగ్‌ ఏరియాలో పంపిణీ చేసి సక్సెస్‌ఫుల్‌ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగి వైజాగ్‌ రాజుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు సత్యకార్తీక్‌ను ‘టిప్పు’ చిత్రం ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారు. చిన్నప్పటి నుండి సినిమాలను చూస్తూ, సినిమాల పట్ల ఆసక్తిని పెంచుకుని ఎప్పటికైనా హీరో కావాలని కకలు కన్న సత్యకార్తీక్‌ తను కలలు కన్న సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ‘టిప్పు’ చిత్రం ద్వారా రాబోతున్నారు. ఆదిత్య ఫిలింస్‌ పతాకంపై సత్య కార్తీక్‌ హీరోగా కనికా కపూర్‌, ఫమేలా హీరోయిన్స్ గా జగదీష్‌ దానేటిని దర్శకునిగా పరిచయం చేస్తూ డి.వి. సీతారామరాజు నిర్మిస్తున్న చిత్రం ‘టిప్పు’. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని మార్చి29న సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో పెద్ద సక్సెస్ సాధించింది. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా… చిత్ర నిర్మాత డి.వి.సీతారామరాజు మాట్లాడుతూ ‘‘ఒక డిఫరెంట్‌ పాయింట్‌తో వస్తున్న ‘టిప్పు’ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. డైరెక్టర్‌ జగదీష్‌ చాలా అద్భుతంగా డైరెక్ట్‌ చేశాడు. మా సత్యకార్తీక్‌ ఫస్ట్‌ మూవీ అయినా కూడా చాలా ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న హీరోలా చేశాడు. షూటింగ్‌ పూర్తయింది. ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మణిశర్మ సంగీతం అందించిన ఆడియో మార్చి నెల 29న విడుదలైంది. మణిశర్మగారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో పాటలను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. అలాగే థియేట్రికల్ ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ చూసిన వారు సత్యకార్తీక్ చాలా బావున్నాడని, సినీ రంగంలో తనకి మంచి భవిష్యత్ ఉంటుందని ఆశీర్వదిస్తున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
సత్య కార్తీక్‌ హీరోగా కనికా కపూర్‌, ఫమేలా హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో చలపతిరావు, ముక్తాఖాన్‌, శ్రావణ్‌, ఎమ్మెస్‌నారాయణ, పోసాని కృష్ణమురళి, కృష్ణభగవాన్‌, రవీంద్ర, రాజశ్రీనాయర్‌, సన, కోటీశ్వరరావు, జయంతి, అపూర్వ ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్‌: వెంకట్‌, డ్రాగన్‌ ప్రకాష్‌, డాన్స్‌: నోబెల్‌, సాహిత్యం: భాస్కరభట్ల, వెన్నెకకంటి, శ్రీమణి, సంగీతం: మణిశర్మ, కథ,స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జగదీష్‌ దానేటి.
Tags:    
Advertisement

Similar News