జర నవ్వండి ప్లీజ్ 66
సినిమా థియేటర్లో లావుటతను ఉన్నాడు. అతని వెనుక సీట్లో చిన్ని కుర్రాడు కూర్చున్నాడు. లావుటతను వెనక్కి తిరిగి ‘బాబూ! నీకేమీ కనిపించడం లేదా’ అన్నాడు ‘అవునంకుల్! నాకేమీ కనిపించడం లేదు. కామెడీ సీను కనిపిస్తే నేనెలా నవ్వాలి?’ ‘ఫర్లేదు బాబూ! కామెడీ వచ్చినప్పుడల్లా నేను కదుల్తాను నేను కదల్నిప్పుడల్లా నువ్వు నవ్వు’ అని సర్దిచెప్పాడు ——————————– ‘అమ్మాయ్! నిన్న నువ్వు కారు నడపడం చూశాను. ఇరవైమైళ్ల స్పీడులో ఉన్నావు. కనీసం నలభై మైళ్ల వేగంతోనైనా నడపాలి’ ‘అబ్బే! […]
Advertisement
సినిమా థియేటర్లో లావుటతను ఉన్నాడు. అతని వెనుక సీట్లో చిన్ని కుర్రాడు కూర్చున్నాడు. లావుటతను వెనక్కి తిరిగి
‘బాబూ! నీకేమీ కనిపించడం లేదా’ అన్నాడు
‘అవునంకుల్! నాకేమీ కనిపించడం లేదు. కామెడీ సీను కనిపిస్తే నేనెలా నవ్వాలి?’
‘ఫర్లేదు బాబూ! కామెడీ వచ్చినప్పుడల్లా నేను కదుల్తాను నేను కదల్నిప్పుడల్లా నువ్వు నవ్వు’ అని సర్దిచెప్పాడు
——————————–
‘అమ్మాయ్! నిన్న నువ్వు కారు నడపడం చూశాను. ఇరవైమైళ్ల స్పీడులో ఉన్నావు. కనీసం నలభై మైళ్ల వేగంతోనైనా నడపాలి’
‘అబ్బే! నాకిష్టముండదండీ! నలభై అంటే మరీ పెద్ద దాన్నయిపోయాననే ఫీలింగ్ వస్తుంది’
——————————–
‘పిల్లి జాతికి చెందిన నాలుగు జంతువుల పేర్లు చెప్పు’
తల్లిపిల్లి, తండ్రిపిల్లి, వాళ్ల ఇద్దరు పిల్లి పిల్లలు’
——————————–
డెండిస్టు – అరే! నీ పన్నే పీకలేదు. ఎందకయ్యా అంతగట్టిగా అరుస్తావ్?
పేషెంట్ – నాకు తెలుసండీ! మీరు నా కాలు తొక్కేస్తున్నారు
———————————
తల్లి గర్వంగా మన అబ్బాయికి ఎనిమిది నెలలే. అప్పుడు వాడు నడక నేర్చుకుని పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నాడు అంది
తండ్రి విసుగ్గా నీ బాధ నించీ ఎప్పుడు బయటపడదామా అని తొందరగా నడక నేర్చుకున్నట్లున్నాడు అన్నాడు.
Advertisement