భూకంపం నుంచి త‌ప్పించుకున్న రాందేవ్‌బాబా

ఖాట్మండు: యోగా గురు బాబా రాందేవ్‌ భూకంపం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. శుక్రవారం నుంచి ఆయన ఖాట్మండులో యోగా శిబిరం నిర్వహిస్తున్నారు. శనివారం తుండి ఖేల్‌ మైదాన్‌లో వేదికపై నుంచి యోగా శిక్షణ ఇచ్చారు. ఆయన కిందికి దిగిన కొద్దిసేపటికే భూకంపం వచ్చింది. అప్పటిదాకా ఆయన ఉన్న వేదిక కూడా కుప్పకూలింది. ‘‘నా కళ్లముందే ఒక పెద్ద భవంతి కుప్పకూలింది. అందులో ఎంతోమంది చిక్కుకుపోయారు. తీవ్ర విధ్వంసం జరిగింది’’ అని రాందేవ్ తెలిపారు. తాను నేపాల్‌లోనే ఉండి […]

Advertisement
Update:2015-04-26 00:50 IST
ఖాట్మండు: యోగా గురు బాబా రాందేవ్‌ భూకంపం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. శుక్రవారం నుంచి ఆయన ఖాట్మండులో యోగా శిబిరం నిర్వహిస్తున్నారు. శనివారం తుండి ఖేల్‌ మైదాన్‌లో వేదికపై నుంచి యోగా శిక్షణ ఇచ్చారు. ఆయన కిందికి దిగిన కొద్దిసేపటికే భూకంపం వచ్చింది. అప్పటిదాకా ఆయన ఉన్న వేదిక కూడా కుప్పకూలింది. ‘‘నా కళ్లముందే ఒక పెద్ద భవంతి కుప్పకూలింది. అందులో ఎంతోమంది చిక్కుకుపోయారు. తీవ్ర విధ్వంసం జరిగింది’’ అని రాందేవ్ తెలిపారు. తాను నేపాల్‌లోనే ఉండి పతంజలి యోగపీఠం తరఫున సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయ‌న తెలిపారు. మరోవైపు.. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ బాబా రాందేవ్‌తో మాట్లాడారు. భారత్‌ వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పామని… ఆయన అక్కడే ఉంటానని తెలిపారని వివరించారు.
Also Read కుదిపేసిన‌ భూకంపం…నేపాల్‌లో 1000కి పైగా మృతులు
Tags:    
Advertisement

Similar News