జర నవ్వండి ప్లీజ్ 64
“వేడిగా ఏమున్నాయి?” “వేసవి కాలం కదా. మంచి నీళ్ళు కూడా వేడిగానే వున్నాయి” “కుక్క వుంది జాగ్రత్త!” అని బోర్డు పెట్టినప్పటి నుండి మీ యింట్లోకి ఎవరూ రావడం లేదనుకుంటా!” “ఎలాంటి కుక్కో చూడ్డానికి ఎక్కువమంది వస్తున్నారు” “నాన్నా! తండ్రన్నవాడు మంచివాళ్ళతో స్నేహం చెయ్యమని సలహా ఇస్తాడు. నువ్వేమో మంచి వాళ్ళతో స్నేహం చెయ్యొద్దని ఎందుకంటున్నావు?” “ఎందుకంటే వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తే వాళ్ళు చెడ్డవాళ్ళయిపోతారు!” “నీ కళ్ళలోకి చూస్తూ కష్టాలన్నీ మరచిపోతా లలితా!” “వెంకట్! మన […]
Advertisement
"వేడిగా ఏమున్నాయి?'' "వేసవి కాలం కదా. మంచి నీళ్ళు కూడా వేడిగానే వున్నాయి''
"కుక్క వుంది జాగ్రత్త!'' అని బోర్డు పెట్టినప్పటి నుండి మీ యింట్లోకి ఎవరూ రావడం లేదనుకుంటా!'' "ఎలాంటి కుక్కో చూడ్డానికి ఎక్కువమంది వస్తున్నారు''
"నాన్నా! తండ్రన్నవాడు మంచివాళ్ళతో స్నేహం చెయ్యమని సలహా ఇస్తాడు. నువ్వేమో మంచి వాళ్ళతో స్నేహం చెయ్యొద్దని ఎందుకంటున్నావు?'' "ఎందుకంటే వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తే వాళ్ళు చెడ్డవాళ్ళయిపోతారు!''
"నీ కళ్ళలోకి చూస్తూ కష్టాలన్నీ మరచిపోతా లలితా!'' "వెంకట్! మన కింకా పెళ్ళే కాలేదు, అప్పుడే నీకు కష్టాలా?''
"టీవీలో వార్తలు చదివే ఆవిడ ఈ మధ్య కనిపించడం లేదు'' "ఆమె టీవీ స్ర్కీన్ని మించి లావెక్కిందట''
"నాన్నా! నీకు దయ్యమంటే భయం లేదా?'' "మీ అమ్మకు భయపడని వాణ్ణి దయ్యానికి భయపడతానా?''
Advertisement