జర నవ్వండి ప్లీజ్ 62

‘ప్రేమ ఒక్క‌టే ఉటే మ‌నం జీవించ‌లేం అందా’ అమ్మాయి ‘లేదు ప్రేమ ఉంటే జీవించ‌వ‌చ్చుస అన్నాడ‌బ్బాయి  ‘‌ఎలా?’ ‘మీ నాన్న నిన్ను ప్రేమిస్తాడు క‌దా!’… …………………………………………………………….. ‘డార్లింగ్‌! నా భార్య అవుతావా?’ ‘మ‌రి. నేను కోరిన‌వ‌న్నీ తీరుస్తావా?’ ‘త‌ప్ప‌క‌’ ‘మ‌న‌తోబాటు మా అమ్మ ఉంటుంది’ ‘ఓకే!’ ‘మీరు సిగ‌రెట్లు మానేసి ఆ డ‌బ్బులు నాకివ్వాలి’ ‘స‌రే!’ ‘అయితే నిన్ను పెళ్లి చేసుకోను. చెప్పిందానిక‌ల్లా త‌లూపే మొగుడు నాకు వ‌ద్దు’ ……………………………………………………………….. త‌ల్లి : అమ్మాయ్‌! ఆ కుర్రాడు […]

Advertisement
Update:2015-04-23 03:05 IST
‘ప్రేమ ఒక్క‌టే ఉటే మ‌నం జీవించ‌లేం అందా’ అమ్మాయి
‘లేదు ప్రేమ ఉంటే జీవించ‌వ‌చ్చుస అన్నాడ‌బ్బాయి
‘‌ఎలా?’
‘మీ నాన్న నిన్ను ప్రేమిస్తాడు క‌దా!’…
……………………………………………………………..
‘డార్లింగ్‌! నా భార్య అవుతావా?’
‘మ‌రి. నేను కోరిన‌వ‌న్నీ తీరుస్తావా?’
‘త‌ప్ప‌క‌’
‘మ‌న‌తోబాటు మా అమ్మ ఉంటుంది’
‘ఓకే!’
‘మీరు సిగ‌రెట్లు మానేసి ఆ డ‌బ్బులు నాకివ్వాలి’
‘స‌రే!’
‘అయితే నిన్ను పెళ్లి చేసుకోను. చెప్పిందానిక‌ల్లా త‌లూపే మొగుడు నాకు వ‌ద్దు’
………………………………………………………………..
త‌ల్లి : అమ్మాయ్‌! ఆ కుర్రాడు ముద్దు అడిగితే ఇవ్వ‌కు
కూతురు : అడ‌క్కుంటే!
……………………………………….
వాళ్ల‌కి ఎంగేజ్‌మెంట్ ఐంది
అమ్మాయి : నేను నీ బాధ‌ల్లో పాలు పంచుకుంటాను
అబ్బాయి : నాకు బాధ‌లు లేవు
అమ్మాయి : మ‌న‌కు పెళ్ల‌యిన త‌ర్వాత విష‌యాల గురించి చెప్పాను
………………………………………………
‘టైమెంత‌యిందో తెలుసా? ఇంకా వంట చెయ్య‌లేదా? న‌న్ను హోట‌ల్‌కు వెళ్ల‌మంటావా?’
‘ఐదు నిమిషాలు ఆగండి’
‘ఐదు నిముషాల్లో వంట చేస్తావా?’
‘నేనూ రెడీ ఐ హోట‌ల్‌కు వ‌స్తాను’
Tags:    
Advertisement

Similar News