అంత‌ర్రాష్ట్ర ప‌న్నుపై హైకోర్టుకు సుప్రీం ఆదేశం

అంతర్‌ రాష్ట్ర  ప‌న్ను విధానాన్ని స‌వాలు చేస్తూ ప్ర‌యివేట ట్రావెల్ ఆప‌రేట‌ర్లు దాఖ‌లు చేసిన కేసును వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టును ఆదేశించింది. మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌తో హైకోర్టు ఈ కేసును వాయిదా వేయ‌డంతో పిటిష‌న‌ర్లు సుప్రీంను ఆశ్ర‌యించారు. దీనిపై న్యాయం కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం జారీ చేసిన జీ.వో.ను స‌వాలు చేస్తూ హైకోర్టుకు వెళ్ళిన ట్రావెల్ ఆప‌రేట‌ర్లు ఇప్ప‌టికి రెండుసార్లు కేసు విచారించింది. చివ‌రిగా మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇస్తూ ప‌న్ను […]

Advertisement
Update:2015-04-22 09:22 IST
అంతర్‌ రాష్ట్ర ప‌న్ను విధానాన్ని స‌వాలు చేస్తూ ప్ర‌యివేట ట్రావెల్ ఆప‌రేట‌ర్లు దాఖ‌లు చేసిన కేసును వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టును ఆదేశించింది. మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌తో హైకోర్టు ఈ కేసును వాయిదా వేయ‌డంతో పిటిష‌న‌ర్లు సుప్రీంను ఆశ్ర‌యించారు. దీనిపై న్యాయం కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం జారీ చేసిన జీ.వో.ను స‌వాలు చేస్తూ హైకోర్టుకు వెళ్ళిన ట్రావెల్ ఆప‌రేట‌ర్లు ఇప్ప‌టికి రెండుసార్లు కేసు విచారించింది. చివ‌రిగా మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇస్తూ ప‌న్ను క‌ట్ట‌వ‌ల‌సిందేన‌ని మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇస్తూ అయితే క‌ట్టిన ప‌న్నును వేరే అవ‌స‌రాల‌కు ఉప‌యోగించ‌కుండా తుది తీర్పు వ‌చ్చే వ‌ర‌కు దాన్ని ఒక‌చోట జ‌మ చేసి ఉంచాల‌ని ఆదేశించింది. అయితే దీనివ‌ల్ల త‌మ‌కు పన్ను భారం త‌ప్ప‌ద‌ని, విచార‌ణ త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని వారు కోరారు. కాని హైకోర్టు కేసును మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌తోనే వాయిదా వేసింది. ఇక చేసేది లేక ప్ర‌యివేటు ట్రావెల్ ఆప‌రేట‌ర్లు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ కేసు హైకోర్టులో విచార‌ణ‌లో ఉన్నందున తాము స్వీక‌రించ‌లేమ‌ని సుప్రీం తిర‌స్క‌రించింది. అయితే ఈ కేసును త్వ‌రిత‌గ‌తిన విచార‌ణ పూర్తి చేయాల‌ని హైకోర్టును ఆదేశించింది.
Tags:    
Advertisement

Similar News