జర నవ్వండి ప్లీజ్ 60

ఫినాయిల్‌ ‘వెయిటర్‌! మీ హొటల్‌ శుభ్రంగా ఫినాయిల్‌తో కడిగినట్లున్నారు’ ‘ఔన్‌ సార్‌! మాకు శుభ్రత అంటే ఎంతో ఇష్టం. మీరీ సంగతి ఎలా కనిపెట్టారు’ ‘ఏం లేదు, కాఫీ ఫినాయిల్‌ వాసన వస్తూంటే…’ చాకిరీ ఏమీ చేతకాని కొడుకుతో డబ్బున్న ఓ తండ్రి ఇలా అంటున్నాడు. ‘నీ వయసులో ఎన్నో పనులు చేశాను. మూటలు మోశాను. కప్పులు కడిగాను. రోజుకు 18 గంటలు పనిచేశాను’ అని అన్నాడు. దానికి కొడుకు ఇలా అన్నాడు. ‘థాంక్స్‌ నాన్నా. ఈ […]

Advertisement
Update:2015-04-19 00:30 IST

ఫినాయిల్‌

‘వెయిటర్‌! మీ హొటల్‌ శుభ్రంగా ఫినాయిల్‌తో కడిగినట్లున్నారు’
‘ఔన్‌ సార్‌! మాకు శుభ్రత అంటే ఎంతో ఇష్టం. మీరీ సంగతి ఎలా కనిపెట్టారు’
‘ఏం లేదు, కాఫీ ఫినాయిల్‌ వాసన వస్తూంటే…’

చాకిరీ

ఏమీ చేతకాని కొడుకుతో డబ్బున్న ఓ తండ్రి ఇలా అంటున్నాడు.
‘నీ వయసులో ఎన్నో పనులు చేశాను. మూటలు మోశాను. కప్పులు కడిగాను. రోజుకు 18 గంటలు పనిచేశాను’ అని అన్నాడు.
దానికి కొడుకు ఇలా అన్నాడు.
‘థాంక్స్‌ నాన్నా. ఈ పనంతా అప్పుడే చేశావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ పనంతా ఇప్పుడు నేను చేయాల్సివచ్చేది’ అన్నాడు.

కోటీశ్వరుడు

ఒక కోటీశ్వరుడు తన మొదటి కూతురు 26 ఏళ్ళ సావిత్రి కోసం 50 లక్షలు, రెండో కూతురు 24 ఏళ్ళ వనిత కోసం 40 లక్షలు, మూడో కూతురు 20 ఏళ్ళ హరిత కోసం 30 లక్షలు దాచిపెట్టానన్నాడు.
ఉత్సాహం కొద్దీ ఒక యువకుడు ‘మీకు నలభై ఏళ్ళ కూతురుందా సార్‌’ అని అడిగాడు.

Tags:    
Advertisement

Similar News