జర నవ్వండి ప్లీజ్ 56
పట్టాలపై సర్దార్జీ సర్దార్జీ రైలు పట్టాలపై ఒక బాటిల్ విస్కీ, తందూరీ చికెన్ దగ్గర పెట్టుకుని కూచున్నాడు. దారంటే వెళుతున్న అతను సర్దార్జీని చూసి ‘సర్దార్జీ పట్టాల మీద ఎందుకు కూచున్నావు? ఇప్పుడో, ఇంకాసేపట్లోనో ట్రెయిన్ వచ్చే అవకాశముంది కదా!’ అన్నాడు. ‘నాకు బతకాలని లేదు. ట్రెయిన్ కింద పడి చనిపోదామని ఇక్కడ కూచున్నా’ అన్నాడు సర్దార్జీ. ‘మరి విస్కీ, తందూరీ చికెన్ ఎందుకు తెచ్చుకున్నావు’ అని అడిగాడు అతను. ‘ట్రెయిన్‌లు సరైన సమయానికి వస్తాయని గ్యారంటీ […]
పట్టాలపై సర్దార్జీ
సర్దార్జీ రైలు పట్టాలపై ఒక బాటిల్ విస్కీ, తందూరీ చికెన్ దగ్గర పెట్టుకుని కూచున్నాడు. దారంటే వెళుతున్న అతను సర్దార్జీని చూసి ‘సర్దార్జీ పట్టాల మీద ఎందుకు కూచున్నావు? ఇప్పుడో, ఇంకాసేపట్లోనో ట్రెయిన్ వచ్చే అవకాశముంది కదా!’ అన్నాడు.
‘నాకు బతకాలని లేదు. ట్రెయిన్ కింద పడి చనిపోదామని ఇక్కడ కూచున్నా’ అన్నాడు సర్దార్జీ.
‘మరి విస్కీ, తందూరీ చికెన్ ఎందుకు తెచ్చుకున్నావు’ అని అడిగాడు అతను.
‘ట్రెయిన్‌లు సరైన సమయానికి వస్తాయని గ్యారంటీ లేదు కదా! రాకుంటే ఆకలితో, దాహంతో నేను చనిపోవాల్సి ఉంటుంది. అందుకని’ అన్నాడు సర్దార్జీ.
సమ్మర్ క్యాంప్
సతీష్ : మా చిన్నవాణ్ణి సమ్మర్ క్యాంప్‌కి పంపుతున్నాం.
స్నేహితుడు : సెలవుల్లో హాయిగా గడుపుతాడు.
సతీష్ : వాడు కాదు మేం!
వర్షం
కొడుకు : నాన్నా! వర్షమెందుకు పడుతుంది?
తండ్రి : వర్షం పడితే పచ్చిక పెరుగుతుంది, పూలు పూస్తాయి.
కొడుకు : మరి వర్షం రోడ్డు మీద ఎందుకు పడుతుంది?