జర నవ్వండి ప్లీజ్ 55

మతిమరుపు ఆమె : డాక్టర్‌! నా సమస్య ఏమిటంటే ప్రతి విషయాన్నీ వెంటనే మర్చిపోతున్నాను. డాక్టర్‌ : ఈ సమస్య ఎప్పట్నించీ ఉంది? ఆమె : ఏ సమస్య? రాష్‌ డ్రైవింగ్‌ ఆ దంపతులు కొత్తగా ఒక డ్రైవర్‌ని పెట్టుకున్నారు. భర్త ఆఫీసుకు వెళ్లిన సమయంలో భార్య కారులో షాపింగ్‌కి వెళ్లింది. అట్లా మూడు రోజులు షాపింగ్‌కు వెళ్లింది. నాలుగో రోజు భర్తతో…. ‘ఈ డ్రైవర్‌ చాలా రాష్‌గా డ్రైవింగ్‌ చేస్తాడు. నేను మూడుసార్లు యాక్సిడెంట్‌ అవుతుందని […]

Advertisement
Update:2015-04-17 04:30 IST

మతిమరుపు

ఆమె : డాక్టర్‌! నా సమస్య ఏమిటంటే ప్రతి విషయాన్నీ వెంటనే మర్చిపోతున్నాను.
డాక్టర్‌ : ఈ సమస్య ఎప్పట్నించీ ఉంది?
ఆమె : ఏ సమస్య?

రాష్‌ డ్రైవింగ్‌

ఆ దంపతులు కొత్తగా ఒక డ్రైవర్‌ని పెట్టుకున్నారు. భర్త ఆఫీసుకు వెళ్లిన సమయంలో భార్య కారులో షాపింగ్‌కి వెళ్లింది. అట్లా మూడు రోజులు షాపింగ్‌కు వెళ్లింది. నాలుగో రోజు భర్తతో….
‘ఈ డ్రైవర్‌ చాలా రాష్‌గా డ్రైవింగ్‌ చేస్తాడు. నేను మూడుసార్లు యాక్సిడెంట్‌ అవుతుందని భయపడ్డాను’ అంది.
దానికి ఆమె భర్త ‘ఇంకోసారి అవకాశమిచ్చి చూడు డార్లింగ్‌’ అన్నాడు.

మినిస్టర్‌ తెలివి

హెల్త్‌ మినిస్టర్‌ ఒకాయన నగరంలోని పెద్ద హాస్పిటల్‌కి విజిట్‌కొచ్చాడు. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అధికారులు మినిస్టర్‌ గారిని ఆపరేషన్‌ థియేటర్‌, జనరల్‌ వార్డుల్లో తిప్పారు. చివరికి ఉమెన్‌ పేషెంట్స్‌ వార్డుకు తీసుకొచ్చారు.
అది చూసి… ‘సర్‌! ఇది లేబర్‌ వార్డ్‌’ సర్‌ అన్నాడు ఒకాయన.
ముందుకు వెళ్లపోయిన మినిస్టర్‌ ఆగి ‘నేను ఈ వార్డును విజిట్‌ చేయను. మన ప్రభుత్వంలో లేబర్‌ మినిస్టర్‌ ఉన్నారు కదా! నేను ఇంకొకరు చేయాల్సిన పని చేయను’ అంటూ వెళ్లిపోయాడు.

Tags:    
Advertisement

Similar News