చెర్రీ తీసేది విజేత సినిమానా..?

 ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా కోసం బ్యాంకాక్ వెళ్లి కొన్ని ఫైటింగ్స్ కూడా నేర్చుకున్నాడు. అయితే ఇప్పుడీ సినిమాపై తాజాగా ఓ రూమర్ హల్ చల్ చేస్తోంది. గతంలో చిరంజీవి నటించిన విజేత సినిమాకు రీమేక్ గానే చరణ్ నయా మూవీ తెరకెక్కుతోందని సమాచారం. విజేతలో చిరంజీవి ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపిస్తే, తాజా సినిమాలో రామ్ చరణ్ ఫైట్ మాస్టర్ లేదా కిక్ […]

Advertisement
Update:2015-04-17 14:00 IST
ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా కోసం బ్యాంకాక్ వెళ్లి కొన్ని ఫైటింగ్స్ కూడా నేర్చుకున్నాడు. అయితే ఇప్పుడీ సినిమాపై తాజాగా ఓ రూమర్ హల్ చల్ చేస్తోంది. గతంలో చిరంజీవి నటించిన విజేత సినిమాకు రీమేక్ గానే చరణ్ నయా మూవీ తెరకెక్కుతోందని సమాచారం. విజేతలో చిరంజీవి ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపిస్తే, తాజా సినిమాలో రామ్ చరణ్ ఫైట్ మాస్టర్ లేదా కిక్ బాక్సర్ గా కనిపించే అవకాశముందంటున్నారు.
రామ్ చరణ్ నయా మూవీపై పుకార్లు రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. విజేత సినిమాలో ఉన్నట్టుగానే ఇందులో కూడా చెల్లెలి సెంటిమెంట్ బాగా ఉంది. చెర్రీ చెల్లెలి పాత్ర కోసం కృతి కర్బందాను తీసుకున్నారు. వీళ్లిద్దరి మధ్య ఎమోషనల్ సీన్లు ఎక్కువగా ఉంటాయని కూడా తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే.. గతంలో చిరంజీవి తీసిన విజేత సినిమానే ఇప్పుడు రీమేక్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే దీనిపై మెగా కాంపౌండ్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు.
Tags:    
Advertisement

Similar News