జర నవ్వండి ప్లీజ్ 53

దగ్గే బెటర్‌ రెగ్యులర్‌గా తన దగ్గరకు వచ్చే పేషెంట్‌తో డాక్టర్‌ ఇలా అంటున్నాడు… ‘నేనిచ్చిన దగ్గు మందు ఇంకా తాగుతున్నావా?’ దానికి ఆ పేషెంట్‌ ‘లేదు డాక్టర్‌. ఒకసారి ఆ మందు కొద్దిగా రుచిచూసి అది తాగడం కన్నా దగ్గడమే మంచిదని నిర్ణయించుకున్నాను’ అన్నాడు. మాలో ఒకడిగా… పిచ్చాసుపత్రిలో పేషెంట్‌ కొత్తగా వచ్చిన డాక్టర్‌తో… ‘వెనకటి డాక్టర్‌ కన్నా నిన్ను బాగా ఇష్టపడుతున్నాం’ అన్నాడు. దానికి ఆ డాక్టర్‌ ‘ఎందుకలా అనుకుంటున్నారు?’ అన్నాడు. ‘ఎందుకంటే నిన్ను మాలో […]

Advertisement
Update:2015-04-16 13:31 IST

దగ్గే బెటర్‌

రెగ్యులర్‌గా తన దగ్గరకు వచ్చే పేషెంట్‌తో డాక్టర్‌ ఇలా అంటున్నాడు…
‘నేనిచ్చిన దగ్గు మందు ఇంకా తాగుతున్నావా?’
దానికి ఆ పేషెంట్‌ ‘లేదు డాక్టర్‌. ఒకసారి ఆ మందు కొద్దిగా రుచిచూసి అది తాగడం కన్నా దగ్గడమే మంచిదని నిర్ణయించుకున్నాను’ అన్నాడు.

మాలో ఒకడిగా…

పిచ్చాసుపత్రిలో పేషెంట్‌ కొత్తగా వచ్చిన డాక్టర్‌తో…
‘వెనకటి డాక్టర్‌ కన్నా నిన్ను బాగా ఇష్టపడుతున్నాం’ అన్నాడు.
దానికి ఆ డాక్టర్‌ ‘ఎందుకలా అనుకుంటున్నారు?’ అన్నాడు.
‘ఎందుకంటే నిన్ను మాలో ఒకడిగా చూస్తున్నాం’ అనే సరికి షాక్‌ తిన్నాడు కొత్త డాక్టర్‌.

తిండి – బిల్లు

ఒక ఆస్పత్రిలో ఇద్దరు డాక్టర్ల మధ్య సంభాషణ ఇలా జరుగుతోంది. అందులో ఒక డాక్టరు అసిస్టెంట్‌. మరొకరు సీనియర్‌.
అసిస్టెంట్‌ డాక్టర్‌ : డాక్టర్‌ గారూ మీరు పేషెంట్లు రోజూ ఏమేం తింటారు? అని ఎందుకు అడుగుతూ ఉంటారు?
సీనియర్‌ డాక్టర్‌ : వాళ్ల తిండి లెవల్‌ని బట్టి మనం బిల్లు వేయొచ్చని.

Tags:    
Advertisement

Similar News