జర నవ్వండి ప్లీజ్ 52

స్వర్గానికి దారి ఒక బిషప్‌ తనకు ఎదురుపడిన కుర్రాళ్లని ‘టౌన్‌హాల్‌కు దారి ఎటు?’ అని అడిగాడు. ఆ కుర్రాళ్లు ‘మీరు టౌన్‌ హాలుకు ఎందుకు వెళుతున్నారు?’ అని ప్రశ్నించారు. ‘అక్కడ నేను స్వర్గానికి వెళ్లే మార్గం’ గురించి ఉపన్యసించ‌ బోతున్నాను’ అన్నాడు. దానికి ఆ కుర్రాళ్లు నవ్వుతూ ‘టౌన్‌హాల్‌కి దారి తెలీని వాడివి స్వర్గానికి దారి ఏం తెలుసుకుంటావు?’ అన్నారు. టెన్త్‌ఫ్లోర్‌ బంధువుల ఇంటికి వచ్చిన ఒకాయన ఇలా అంటున్నాడు. ‘లిఫ్ట్‌బాయ్‌! నన్ను టెన్త్‌ఫ్లోర్‌ దాకా తీసుకెళ్లు’ […]

Advertisement
Update:2015-04-16 00:30 IST

స్వర్గానికి దారి

ఒక బిషప్‌ తనకు ఎదురుపడిన కుర్రాళ్లని ‘టౌన్‌హాల్‌కు దారి ఎటు?’ అని అడిగాడు. ఆ కుర్రాళ్లు ‘మీరు టౌన్‌ హాలుకు ఎందుకు వెళుతున్నారు?’ అని ప్రశ్నించారు. ‘అక్కడ నేను స్వర్గానికి వెళ్లే మార్గం’ గురించి ఉపన్యసించ‌ బోతున్నాను’ అన్నాడు. దానికి ఆ కుర్రాళ్లు నవ్వుతూ ‘టౌన్‌హాల్‌కి దారి తెలీని వాడివి స్వర్గానికి దారి ఏం తెలుసుకుంటావు?’ అన్నారు.

టెన్త్‌ఫ్లోర్‌

బంధువుల ఇంటికి వచ్చిన ఒకాయన ఇలా అంటున్నాడు.
‘లిఫ్ట్‌బాయ్‌! నన్ను టెన్త్‌ఫ్లోర్‌ దాకా తీసుకెళ్లు’
‘ఇక్కడ ఆరుఫ్లోర్లే ఉన్నాయండి’
‘నో ప్రాబ్లం! తక్కిన నాలుగు మెట్లెక్కి వెళతాలే’

కలర్స్‌ సిగ్నల్‌

ఒక పోలీసాఫీసర్‌ భార్య కారు ట్రాఫిక్‌లో ఆగింది. కాసేపటికి అన్ని కార్లు కదిలాయి.
ఆమె కారు కదలలేదు. రెడ్‌ లైట్‌ పోయింది. ఎల్లో లైట్‌ వచ్చింది. తర్వాత గ్రీన్‌లైట్‌, మళ్లీ ఎల్లో లైట్‌ మళ్లీ రెడ్‌ లైట్‌. అయినా కారు ముందుకు కదలలేదు. పోలీసు పరిగెట్టుకుంటూ వచ్చి ‘మేడం! మీకు మా లైట్ల రంగులేవీ నచ్చినట్లు లేదు’ అన్నాడు.

Tags:    
Advertisement

Similar News