జర నవ్వండి ప్లీజ్ 51

సర్దార్జీ తెలివి ఇద్దరు సర్దార్జీలు ఒక మల్టీస్టోర్‌ బిల్డింగ్‌లో ఉంటారు. ఒకరేమో ఫస్ట్‌ఫ్లోర్‌లో, ఒకరేమో ఎనిమిదవ ఫ్లోర్‌లో ఉంటారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. ఎనిమిదో ఫ్లోర్‌లో ఉన్న సర్దార్జీ మెదటి ఫ్లోర్‌లో ఉన్న సర్దార్జీని అవమానించాలని ఒకసారి డిన్నర్‌కు పిలిచాడు. మొదటి ఫ్లోర్‌లో ఉన్న సర్దార్జీ ఎనిమిదవ ఫ్లోర్‌కు వెళ్లాడు. వెళ్తే అక్కడి సర్దార్జీ ప్లాటు లాక్‌ చేసి ఉంది. కానీ తలుపుకు ఒక బోర్డు మీద ‘నిన్ను ఫూల్‌ని చేశాను’ అని రాసి ఉంది. […]

Advertisement
Update:2015-04-15 13:30 IST

సర్దార్జీ తెలివి

ఇద్దరు సర్దార్జీలు ఒక మల్టీస్టోర్‌ బిల్డింగ్‌లో ఉంటారు. ఒకరేమో ఫస్ట్‌ఫ్లోర్‌లో, ఒకరేమో ఎనిమిదవ ఫ్లోర్‌లో ఉంటారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. ఎనిమిదో ఫ్లోర్‌లో ఉన్న సర్దార్జీ మెదటి ఫ్లోర్‌లో ఉన్న సర్దార్జీని అవమానించాలని ఒకసారి డిన్నర్‌కు పిలిచాడు. మొదటి ఫ్లోర్‌లో ఉన్న సర్దార్జీ ఎనిమిదవ ఫ్లోర్‌కు వెళ్లాడు. వెళ్తే అక్కడి సర్దార్జీ ప్లాటు లాక్‌ చేసి ఉంది. కానీ తలుపుకు ఒక బోర్డు మీద ‘నిన్ను ఫూల్‌ని చేశాను’ అని రాసి ఉంది. అది చూసిన ఫస్ట్‌ఫ్లోర్‌ సర్దార్జీకి విపరీతంగా కోపం వచ్చింది. ఆ బోర్డు తిప్పి ‘నేనసలు ఇక్కడికి రానేలేదు’ అని రాశాడు.

ఓన్లీ వన్‌

ఒక విద్యాశాఖాధికారి స్కూలుకు వచ్చి పిల్లల్తో ఇలా అన్నాడు. ‘అన్నిటికన్నా కష్టమైన ఒక ప్రశ్న వేయమంటారా? లేదా సులభమైన రెండు ప్రశ్నలు వేయమంటారా?’ అన్నాడు. ఒక తెలివైన కుర్రాడు కష్టమయిన ఒక ప్రశ్న అడగమన్నాడు.
‘ప్రపంచంలో పుట్టిన మొదటి స్త్రీ ఎవరు?’ అన్నాడు ఆ అధికారి.
ఆ కుర్రాడు వెంటనే ‘జుబ్లీహిల్స్‌లోని హాస్పిటల్‌లో పుట్టిన ఆమె’ అన్నాడు.
ఇన్‌స్పెక్టర్‌ ఆశ్చర్యంగా ‘ఆ సంగతి నీకెట్లా తెలుసు?’ అన్నాడు.
ఆ కుర్రాడు ‘నో సెకండ్‌ క్వశ్చన్‌ ప్లీజ్‌!’ అన్నాడు.

మేడిన్‌ జపాన్‌

ఒక జపాన్‌ టూరిస్టు ఇండియా వచ్చాడు. టాక్సీ మాట్లాడుకుని ఢిల్లీ అంతా తిరుగుతున్నాడు. జపాన్‌ ‘ఫాస్ట్‌’లైఫ్‌తో కంపేర్‌ చేసుకుంటే ఇండియాలో అంతా మెల్లగా, నెమ్మదిగా సాగుతున్నట్లని పించింది. చివరికి ఆపుకోలేక టాక్సీ డ్రైవర్‌తో ‘ఏమిటయ్యా! ఇక్కడ అన్నీ స్లోగా ఉన్నాయి. మీ టాక్సీలు స్లోగా పోతున్నాయి. అదే జపాన్‌లో టాక్సీలు చాలా స్పీడ్‌గా వెళతాయి. మీ బస్సులు మెల్లగా పిల్లిలా పోతున్నాయి. మీ మోటారు సైకిళ్ళు ఎడ్లబళ్ళలా పోతున్నాయి. జపాన్లో గాల్లో తేలుతాయి’ అన్నాడు.సిటీ అంతా చూశాకా టూరిస్టు మీటరు చూశాడు. ఐదువందల రూపాయలయ్యాయి. అదిరిపోయాడు. ‘మీ మీటర్లేమిటి ఇంత ఫాస్ట్‌గా వున్నాయి?’ అన్నాడు. టాక్సీ డ్రైవర్‌ తాపీగా ‘అవి మేడిన్‌ జపాన్‌ సార్‌’ అన్నాడు.

Tags:    
Advertisement

Similar News