ఎన్‌కౌంటర్‌పై ఎన్.హెచ్.ఆర్.సి. ఆదేశాలు
ఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పౌరహక్కుల సంఘాలు ఇచ్చిన ఫిర్యాదులను పురస్కరించుకుని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్.హెచ్.ఆర్.సి.) శేషాచల ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు శాఖకు కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ఎన్‌కౌంటర్ సాక్షులు, గ్రామ సర్పంచ్‌లకు రక్షణ కల్పించాలని, ఈ సంఘటనపై ప్రత్యక్ష సాక్ష్యం చెప్పడానికి వచ్చిన శేఖర్, బాలచంద్రలకు కూడా తగిన భద్రత కల్పించాలని ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు, పోలీసు అధికారులు, అటవీశాఖ అధికారుల పేర్లు వెల్లడించాలని కోరింది. […]
Advertisement
ఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పౌరహక్కుల సంఘాలు ఇచ్చిన ఫిర్యాదులను పురస్కరించుకుని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్.హెచ్.ఆర్.సి.) శేషాచల ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు శాఖకు కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ఎన్‌కౌంటర్ సాక్షులు, గ్రామ సర్పంచ్‌లకు రక్షణ కల్పించాలని, ఈ సంఘటనపై ప్రత్యక్ష సాక్ష్యం చెప్పడానికి వచ్చిన శేఖర్, బాలచంద్రలకు కూడా తగిన భద్రత కల్పించాలని ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు, పోలీసు అధికారులు, అటవీశాఖ అధికారుల పేర్లు వెల్లడించాలని కోరింది. ఈ సంఘటనకు సంబంధించిన డైరీ, ఎఫ్.ఐ.ఆర్. కాపీలు భద్రంగా ఉంచాలని, అవసరమైనప్పుడు వాటిని అందజేయాలని సూచించింది. తదుపరి విచారణను హైదరాబాద్‌లో ఈ నెల 23న చేపడతామని తెలిపింది.-పీఆర్
Advertisement