జర నవ్వండి ప్లీజ్ 44

తెలివి మీరిన చిన్నారి సముద్రతీరంలో ఒక పాప ‘మా అమ్మ కనిపించడం లేదు’ అని ఏడుపు మొదలు పెట్టింది. చుట్టుపక్కల చూసే జనం ఆ అమ్మాయిని ఓదార్చి చిప్స్‌ ప్యాకెట్లు, చాక్‌లెట్లు, కూల్‌డ్రింక్‌ కొనిచ్చారు. అవన్నీ తింటూ తాగుతూ ఏడుపు మానేసింది. అంతలో ఒకావిడ వచ్చి ‘మీ మమ్మీ ఎక్కడ వుందో నాకు తెలుసు’ అంది. ఆ పాప ‘నాకు తెలుసు తిన్నాక వెళతాను’ అంది. ********** బుర్రలేని వాడు డాక్టర్‌ ఆ పేషెంట్‌ని చూసి ‘నా […]

Advertisement
Update:2015-04-12 00:30 IST

తెలివి మీరిన చిన్నారి
సముద్రతీరంలో ఒక పాప ‘మా అమ్మ కనిపించడం లేదు’ అని ఏడుపు మొదలు పెట్టింది. చుట్టుపక్కల చూసే జనం ఆ అమ్మాయిని ఓదార్చి చిప్స్‌ ప్యాకెట్లు, చాక్‌లెట్లు, కూల్‌డ్రింక్‌ కొనిచ్చారు. అవన్నీ తింటూ తాగుతూ ఏడుపు మానేసింది.
అంతలో ఒకావిడ వచ్చి ‘మీ మమ్మీ ఎక్కడ వుందో నాకు తెలుసు’ అంది. ఆ పాప ‘నాకు తెలుసు తిన్నాక వెళతాను’ అంది.

**********

బుర్రలేని వాడు
డాక్టర్‌ ఆ పేషెంట్‌ని చూసి ‘నా దగ్గరికి రాకముందు వేరే డాక్టర్‌ను ఎవర్నయినా కలిశావా?’
పేషెంట్‌ : లేదు డాక్టర్‌! మెడికల్‌ షాపతన్ని కలిశాను
డాక్టర్‌ : ఆ బుర్రలేని వాడేమన్నాడు?
పేషెంట్‌ : మిమ్మల్ని కలవమన్నారండీ!

**********

ఏం జరిగింది?

డాక్టర్‌ లోపలికి వెళ్ళాడు. బయటికొచ్చాడు. సుబ్బారావు ఆదుర్దాగా చూస్తున్నాడు. మొదట డాక్టర్‌ బయటికి వచ్చి స్క్రూ డ్రైవర్‌ పట్టుకెళ్ళాడు. తరువాత కాసేపటికి వచ్చి సుత్తి పట్టుకెళ్ళాడు. ఏవో శబ్దాలు వచ్చాయి.
డాక్టర్‌ బయటికి వచ్చి చెమట తుడుచుకున్నాడు.
సుబ్బారావు ఆందోళన భరించలేక ‘మా ఆవిడకు ఏమైంది డాక్టర్‌! అన్నాడు.
‘ఎలా చెప్పగలను. ఇంకా టెస్టే చెయ్యందే. నా టేబుల్‌ డ్రా ఓపెన్‌ కావడం లేదు. దాంట్లో నా స్టెతస్కోపు వుండిపోయిం’దన్నాడు.

***********

కనిపిస్తోందా?
ఒక వ్యక్తి కళ్ళ డాక్టర్‌ దగ్గరకు వెళ్ళాడు. టెస్టులు చేశాక కూర్చోమని చెప్పి డాక్టర్‌ ఒక టెస్ట్‌ కార్డు చూపించి
‘ఇవి చదవగలవా?’ అన్నాడు
‘చదవలేను’ అన్నాడు వ్యక్తి.
డాక్టర్‌ ఆ కార్డును కళ్లకు మరింత దగ్గరగా పెట్టి ‘ఇప్పుడు?’ అన్నాడు.
ఆ వ్యక్తి ‘చదవలేను’ అన్నాడు.
డాక్టర్‌ దాదాపు కళ్లకు తగిలేట్లు పెట్టి ‘ఇప్పుడు?’ అన్నాడు.
‘చదవలేను సార్‌. నాకు చదవడం రాదు’ అన్నాడు.

Tags:    
Advertisement

Similar News