ఓబీసీ ఆదాయ పరిమితి పెంపుకు బీసీ కమిషన్ సిఫార్సు
ఓబీసీ రిజర్వేషన్ల క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 6 లక్షల నుంచి రూ. 10.50 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి. ఈశ్వరయ్య తెలిపారు. ప్రస్తుతం జీవన ప్రమాణాలు, వేతనాలు పెరిగిన నేపథ్యంలో క్రీమీలేయర్ పరిమితిని పెంచడం వల్ల ఇది న్యాయబద్దమైన ప్రతిపాదన అని పేర్కొన్నారు. ఈ క్రీమీలేయర్ పరిధిలోకి గ్రూపు-1 అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జాతీయ కమిషన్ సభ్యులు వస్తారన్నారు. జాతీయస్థాయిలో బీసీ కులాలవారీ […]
Advertisement
ఓబీసీ రిజర్వేషన్ల క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 6 లక్షల నుంచి రూ. 10.50 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి. ఈశ్వరయ్య తెలిపారు. ప్రస్తుతం జీవన ప్రమాణాలు, వేతనాలు పెరిగిన నేపథ్యంలో క్రీమీలేయర్ పరిమితిని పెంచడం వల్ల ఇది న్యాయబద్దమైన ప్రతిపాదన అని పేర్కొన్నారు. ఈ క్రీమీలేయర్ పరిధిలోకి గ్రూపు-1 అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జాతీయ కమిషన్ సభ్యులు వస్తారన్నారు. జాతీయస్థాయిలో బీసీ కులాలవారీ సమగ్ర సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ, ఏపీలకు జాతీయ కమిషన్ ఆధ్వర్యంలో 3 రోజులపాటు నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ (పబ్లిక్ హియరింగ్) ముగిసిన అనంతరం శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషన్ మిగతా సభ్యులతోపాటు ఆయన మాట్లాడారు. హిజ్రాలను తాము బీసీలుగా గుర్తించామని, ఒకవేళ వారు ఎస్సీలైతే ఏ రిజర్వేషన్ వర్తించాలనే దానిపై సమీక్ష పెండింగ్‌లో ఉందన్నారు. తెలంగాణ, ఏపీలలో అనాథలుగా స్టేట్‌హోం, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వారిని ఓబీసీలుగా గుర్తించేందుకు కమిషన్ సిద్ధంగా ఉందన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు బీసీ కమిషన్లను ఏర్పాటు చేస్తే ఆయా అంశాల పరిశీలనకు సంబంధించి తమ పని సులువు అవుతుందని ఈశ్వరయ్య అన్నారు.-పీఆర్
Advertisement