జర నవ్వండి ప్లీజ్ 41

ట్రైనింగ్‌ రోజూ ఒకడే వచ్చే బిచ్చగాడు ఆ రోజు ఇంకొకతన్ని వెంటబెట్టుకుని వచ్చాడు. ఆ ఇల్లాలు ‘ఐతే ఇప్పుడు ఒకరు ఇద్దరై బిచ్చ మెత్తుకుంటున్నారన్న మాట’ అంది. దానికి మొదటి బిచ్చగాడు ‘కాదమ్మా! మామూలుగా నేనే వస్తాను. నేను సెలవులో వెళితే ఏయే ఇళ్ళకు రావాలో ఇతనికి చూపిస్తున్నా’ అన్నాడు. ************ కొత్త రుచి! ”అమ్మా! కొత్త వంటవాడిని ఏర్పాటు చెయ్యి!” చెప్పింది కూతురు. ”ఏవండోయ్‌…మిమ్మల్నే…ఇటు రండి త్వరగా. మన అమ్మాయి పెళ్ళికి ఒప్పుకుంది” వంటింట్లోకి కేక […]

Advertisement
Update:2015-04-10 13:30 IST

ట్రైనింగ్‌
రోజూ ఒకడే వచ్చే బిచ్చగాడు ఆ రోజు ఇంకొకతన్ని వెంటబెట్టుకుని వచ్చాడు. ఆ ఇల్లాలు ‘ఐతే ఇప్పుడు ఒకరు ఇద్దరై బిచ్చ మెత్తుకుంటున్నారన్న మాట’ అంది.
దానికి మొదటి బిచ్చగాడు ‘కాదమ్మా! మామూలుగా నేనే వస్తాను. నేను సెలవులో వెళితే ఏయే ఇళ్ళకు రావాలో ఇతనికి చూపిస్తున్నా’ అన్నాడు.

************

కొత్త రుచి!
”అమ్మా! కొత్త వంటవాడిని ఏర్పాటు చెయ్యి!” చెప్పింది కూతురు.
”ఏవండోయ్‌…మిమ్మల్నే…ఇటు రండి త్వరగా. మన అమ్మాయి పెళ్ళికి ఒప్పుకుంది” వంటింట్లోకి కేక పెట్టింది తల్లి.

************

మార్పు
”మా అబ్బాయి గుణంలో బాగా మార్పు వచ్చిందోయ్‌!” అన్నాడు రాజు.
”ఎలా చెప్పగలుగుతున్నావు?” అడిగాడు రాము.
”ఇది వరకు వీధిలో క్రికెట్‌ ఆడినప్పుడల్లా మా కిటికీ అద్దాలు పగలగొట్టేవాడు. ఇపుడు ఎదురింటివాళ్లవి మాత్రమే పగలగొడుతున్నాడు” చెప్పాడు రాజు.

***********

రన్నింగ్‌ ప్రాక్టీస్‌
తండ్రికొడుక్కి ఆత్మరక్షణ కోసం ఎట్లా ఫైటింగ్‌ చేయాలో నేర్పుతున్నాడు.
స్నేహితుడు ‘ఎందుకిదంతా చెబుతున్నావు?’ అన్నాడు.
‘ఎవరయినా తనని కొట్టడానికి వస్తే ఎట్లా ఫైటింగ్‌ చేయాలో నేర్పుతున్నాను’ అన్నాడు తండ్రి. ‘మరి మీవాడి కన్నా బలమైనవాడు మీదికొస్తే?’ ‘పారిపోవడమెలాగో ప్రాక్టీసు చేయిస్తా’ అన్నాడు తండ్రి.

***********

మాటకు మాట
జార్జి తన గాడిదను ఒక ఆర్మీ క్యాంప్‌ పక్కనించి తోలుకెళుతున్నాడు.
అది చూసిన ఇద్దరు సైనికులు అతన్ని వుడికించాలని వెళ్ళి ‘మీ తమ్ముణ్ణి ఎందుకంత గట్టిగా లాగుతున్నావు?’ అన్నారు నవ్వుతూ.
‘లేకుంటే వెళ్ళి మిల్ట్రీలో చేరతానంటున్నాడు’ అన్నాడు జార్జి.

Tags:    
Advertisement

Similar News