భూసేకరణను వ్యతిరేకించిన మేధాపాట్కర్

ఎపి రాజధాని నిర్మించ తలపెట్టిన ప్రాంతానికి ప్రముఖ సామాజికవేత్త మేధా పాట్కర్ గురువారం ఉదయం వచ్చారు. తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద పొలాలను ఆమె పరిశీలించారు. ప్రజాభిప్రాయన్ని లెక్కచేయకుండా, ప్రభుత్వం బలవంతంగా రైతుల భూములను రెవెన్యూ,పోలీసు, రాజధాని సంస్థ అధికారులతో భయపెట్టి, లాక్కొని వారికి అన్యాయం చేసిందని ఆమె తీవ్రంగా విమర్శించారు. మూడు పంటలు పండే భూములను సీఆర్‌డీఏ చట్టం కింద ఎలా తీసుకుంటారని ఆమె ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో భూములివ్వడానికి సమ్మతి తెలిపిన […]

Advertisement
Update:2015-04-09 08:57 IST

ఎపి రాజధాని నిర్మించ తలపెట్టిన ప్రాంతానికి ప్రముఖ సామాజికవేత్త మేధా పాట్కర్ గురువారం ఉదయం వచ్చారు. తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద పొలాలను ఆమె పరిశీలించారు. ప్రజాభిప్రాయన్ని లెక్కచేయకుండా, ప్రభుత్వం బలవంతంగా రైతుల భూములను రెవెన్యూ,పోలీసు, రాజధాని సంస్థ అధికారులతో భయపెట్టి, లాక్కొని వారికి అన్యాయం చేసిందని ఆమె తీవ్రంగా విమర్శించారు. మూడు పంటలు పండే భూములను సీఆర్‌డీఏ చట్టం కింద ఎలా తీసుకుంటారని ఆమె ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో భూములివ్వడానికి సమ్మతి తెలిపిన రైతులు ఇప్పుడు తమకు ఇష్టం లేకపోతే అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి తెలియజేయవచ్చు అని ఆమె అన్నారు.

Tags:    
Advertisement

Similar News