రాజుకుంటున్న చిచ్చు 

ఏపీ, త‌మిళ‌నాడుల‌ మ‌ధ్య చిచ్చు రాజుకుంటూనే ఉంది. వ‌రుసగా మూడోరోజూ రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున శేషాచ‌లం అడ‌వుల్లో జ‌రిగిన, ఎన్‌కౌంట‌ర్ త‌ర్వాత‌ ఏపీ ప్ర‌భుత్వ తీరుపై త‌మిళ‌నాడులోని అన్ని వ‌ర్గాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూనే ఉన్నాయి. మూడు రోజుల నుంచి ఏపీ స‌రిహ‌ద్దుల్లోనూ, త‌మిళ‌నాడులోని ప‌లు ప్రాంతాల్లోనూ నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దిష్టిబొమ్మ‌ల‌ను ద‌గ్ధం చేస్తూ త‌మిళ సంఘాలు ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తున్నాయి. మూడు రోజుల నుంచి ఆర్టీసీ […]

Advertisement
Update:2015-04-09 06:11 IST

ఏపీ, త‌మిళ‌నాడుల‌ మ‌ధ్య చిచ్చు రాజుకుంటూనే ఉంది. వ‌రుసగా మూడోరోజూ రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున శేషాచ‌లం అడ‌వుల్లో జ‌రిగిన, ఎన్‌కౌంట‌ర్ త‌ర్వాత‌ ఏపీ ప్ర‌భుత్వ తీరుపై త‌మిళ‌నాడులోని అన్ని వ‌ర్గాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూనే ఉన్నాయి. మూడు రోజుల నుంచి ఏపీ స‌రిహ‌ద్దుల్లోనూ, త‌మిళ‌నాడులోని ప‌లు ప్రాంతాల్లోనూ నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దిష్టిబొమ్మ‌ల‌ను ద‌గ్ధం చేస్తూ త‌మిళ సంఘాలు ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తున్నాయి. మూడు రోజుల నుంచి ఆర్టీసీ బ‌స్సులు రెండు రాష్ట్రాల మ‌ధ్య తిర‌గ‌డం లేదు. మొత్తం 200 స‌ర్వీసుల‌ను ఏపీఎస్ఆర్టీసీ ఆపేసింది. దాని వ‌ల్ల ఆదాయానికి భారీగానే గండిప‌డుతోంది.

గ‌త రెండు రోజుల్లోనే ప‌ది ల‌క్ష‌ల వ‌ర‌కు న‌ష్టం వ‌చ్చింద‌ని అధికారులు చెబుతున్నారు. మ‌రోవైపు ప‌లు ప్రాంతాల్లో జ‌రిగిన దాడుల్లో ఆర్టీసీ బ‌స్సులు ధ్వంస‌మ‌య్యాయి. ప్ర‌ధానంగా చెన్నై, సేలం, వేలూరు, మ‌ధురై ప్రాంతాల్లో ఆందోళ‌నలు జ‌రుగుతున్నాయి. ఆంధ్రా భ‌వ‌నాలే ల‌క్ష్యంగా ఇవి జ‌రుగుతున్నాయి. ఆంధ్రా బ్యాంకులు, టీటీడీ టిక్కెట్ సెంట‌ర్‌, ఆంధ్రా క్లబ్ ద‌గ్గ‌ర త‌మిళ సంఘాల కార్య‌క‌ర్త‌లు దాడుల‌కు పాల్ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు అంత‌టా ఉన్న ఏపీ భ‌వ‌నాల‌కు పోలీసులు ప్ర‌త్యేక భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నారు. మ‌రోవైపు మృత‌దేహాల అప్ప‌గింత కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది.ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తుప‌ట్టిన మృత‌దేహాల‌ను వారి బంధువుల‌కు అప్ప‌గించారు.

రూ.3 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా
20 మంది కూలీలు ఎన్‌కౌంట‌ర్ అయిన నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఒక్కొక్క‌రి కుటుంబానికి మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల ఎక్స్‌గ్రేషియాను ప్ర‌క‌టించింది. ఎన్‌కౌంట‌ర్‌పై సీరియ‌స్‌గా స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు.మృత‌దేహాల‌ను త‌ర‌లించే బాధ్య‌త‌ను అధికారుల‌కు అప్ప‌గించారు. అందుకోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఐజీ స్థాయి అధికారిని కూడా నియ‌మించారు. కావాల‌నే ఏపీ పోలీసులు త‌మిళ కూలీల‌ను కాల్చేశార‌ని అక్క‌డిప్ర‌భుత్వం భావిస్తోంది. ఆ కోణంలోనే అక్క‌డి పోలీసుల విచార‌ణ కొన‌సాగుతోంది.

 

Tags:    
Advertisement

Similar News