జర నవ్వండి ప్లీజ్ 37

శ్మశానంలోనూ… అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఒక శ్మశానంలో ఒక అమెరికన్‌ తన తండ్రి సమాధి ముందు పూలగుత్తులు ఉంచాడు. దగ్గరే ఒక చైనా అతను తన తండ్రి సమాధి ముందు అన్నం, యితర తినుబండారాలు ఉంచి పూజ చేశాడు. అమెరికన్‌ అదంతా చూసి ‘మీ నాన్న సమాధి నించి లేచి వచ్చి ఇవన్నీ ఎప్పుడు తింటాడు” అని అవహేళనగా అన్నాడు. చైనా అతను నిర్మలంగా ‘మీ నాన్న లేచి వచ్చి నువ్వు పెట్టిన పూలను వాసన చూసినప్పుడు” […]

Advertisement
Update:2015-04-08 13:30 IST

శ్మశానంలోనూ…
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఒక శ్మశానంలో ఒక అమెరికన్‌ తన తండ్రి సమాధి ముందు పూలగుత్తులు ఉంచాడు. దగ్గరే ఒక చైనా అతను తన తండ్రి సమాధి ముందు అన్నం, యితర తినుబండారాలు ఉంచి పూజ చేశాడు. అమెరికన్‌ అదంతా చూసి ‘మీ నాన్న సమాధి నించి లేచి వచ్చి ఇవన్నీ ఎప్పుడు తింటాడు” అని అవహేళనగా అన్నాడు. చైనా అతను నిర్మలంగా ‘మీ నాన్న లేచి వచ్చి నువ్వు పెట్టిన పూలను వాసన చూసినప్పుడు” అన్నాడు.
************
మిమిక్రీ గొప్పలు
ముగ్గురు మిమిక్రీ ఆర్టిస్టులు ఒక చోట కలిసి గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టారు.
మొదటి అతను ”నేను ఒక పశువుల మంద దగ్గరికి వెళ్లి సింహంలా గర్జిస్తే ఆవులూ, గొర్రెలు చెల్లాచెదురయ్యాయి” అన్నాడు. రెండో అతను, ”నేను మా వీధిలో ఆల్సేషియన్‌ కుక్కలా ఒకసారి మొరిగితే భయంతో పిల్లలు కాలికి బుద్ధిచెప్పారు. ఉత్తరాలు ఇవ్వడానికి వచ్చిన పోస్ట్‌మెన్‌ దగ్గరే ఉన్న చెట్టెక్కి భయంతో వణికిపోయాడు” అని తన గొప్పతనం చెప్పుకున్నాడు. మూడో ఆర్టిస్ట్‌ కాసేపు మౌనంగా ఉండి యిలా అన్నాడు. ”నేను మీలాగా ఎవర్నీ హడలు కొట్టలేదు. భయపెట్ట లేదు. ఐతే నిన్న రాత్రి తెల్లవారుజామున కోడిపుంజులాగా కొక్కరోకో అని అరిచాను. అలా అరవడం వల్ల ఎవరూ భయపడలేదు. కానీ ఎక్కడో కొండల వెనక ఉన్న సూర్యుడు మాత్రం ఆకాశంలోకి వచ్చాడు” అన్నాడు.
************
1+1
‘ఈ పుస్తకం చదివితే నువ్వనుకున్నది సగం సాధించినట్లు’.
‘ఐతే రెండు పుస్తకాలివ్వండి’.
************
బిజినెస్‌ ట్రిక్‌
కొత్తగా పెట్టిన చేపల అంగడి అభివృద్ధి చెందడం చూసిన కస్టమర్‌ చేపల షాపతన్ని ”మీ వ్యాపారం అభివృద్ధి చెందడంలోని రహస్యం ఏమిటి?” అని అడిగాడు.
చేపల వ్యాపారి ”అదో సీక్రెట్‌. మీరు మా రెగ్యులర్‌ కస్టమర్‌ కాబట్టి చెబుతున్నా. చేపల తలలు వారం తింటే తెలివి పెరుగుతుంది” అన్నాడు. ఖరీదడిగాడు కస్టమర్‌. ”ఒక్కో తల పన్నెండు రూపాయలు” అన్నాడు వ్యాపారస్థుడు.
కస్టమర్‌ వారం తర్వాత వచ్చి ‘నా తెలివేమీ పెరగలేదే” అన్నాడు ‘మీరు ఎక్కువ తినాలి’ అన్నాడు వ్యాపారి. కస్టమర్‌ మరో వారం తర్వాత వచ్చి ”మోసం, దగా! బయట డజను పన్నెండ్రూపాయలకు అమ్ముతూ వుంటే మీరేమో ఒక్కోటి పన్నెండు రూపాయలకమ్ముతున్నారు” అన్నాడు కోపంగా. ”చూడండి! వాటిని బాగా తినడం వల్ల అప్పుడే మీ తెలివితేటలు పెరిగాయి” వ్యాపారస్థుడు అన్నాడు.

Tags:    
Advertisement

Similar News