జర నవ్వండి ప్లీజ్ 36

ఒక రోజు ముందు ఆ ఆఫీసర్‌ ‘రేపటి పని ఈ రోజే చేయండి’ అన్న బోర్డులు తయారు చేయించి అన్ని సెక్షన్లలో పెట్టించాడు. రెండుగంటలు గడిచాయో లేదో ఉద్యోగస్తులు ఒకరు ప్రమోషన్‌ కోసం, ఇంకొకరు ఫెస్టివల్‌ అడ్వాన్స్‌ కోసం, మరొకావిడ మెటర్నిటీ లీవు కోసం వరుసగా అప్లికేషన్లు పెట్టే సరికి ఆ ఆఫీసర్‌ తెల్లమొఖం వేశాడు. ************ సర్కారు కారు బిజీ రోడ్డు పక్కనే పార్కు చేసిన అంబాసిడర్‌ కారు చూసి పోలీసు ‘బకరా దొరికాడు, కేసు […]

Advertisement
Update:2015-04-08 00:30 IST

ఒక రోజు ముందు
ఆ ఆఫీసర్‌ ‘రేపటి పని ఈ రోజే చేయండి’ అన్న బోర్డులు తయారు చేయించి అన్ని సెక్షన్లలో పెట్టించాడు. రెండుగంటలు గడిచాయో లేదో ఉద్యోగస్తులు ఒకరు ప్రమోషన్‌ కోసం, ఇంకొకరు ఫెస్టివల్‌ అడ్వాన్స్‌ కోసం, మరొకావిడ మెటర్నిటీ లీవు కోసం వరుసగా అప్లికేషన్లు పెట్టే సరికి ఆ ఆఫీసర్‌ తెల్లమొఖం వేశాడు.
************
సర్కారు కారు
బిజీ రోడ్డు పక్కనే పార్కు చేసిన అంబాసిడర్‌ కారు చూసి పోలీసు ‘బకరా దొరికాడు, కేసు బుక్‌ చేయొచ్చుననుకుని’ కారు దగ్గరికి వెళ్ళాడు.
************
కారుకు అతికించిన నోటీసు చదివాడు.
”అయ్యా! ఇది ప్రభుత్వానికి చెందిన కారు, ట్రాఫిక్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా ఎక్కడయినా పార్క్‌ చేశారనుకోండి. మీరు బుక్‌ చేసే కేసుకు సంబంధించిన రిసీట్‌ ఆరు కాపీలు తీయండి. డ్రైవర్‌ దగ్గర మరో ఫారం ఉంటుంది. అది ఫిలప్‌ చేయండి. ఆ ఫారమ్‌ జిరాక్స్‌ తీసి మీ ఒరిజనల్‌ రిసీట్‌తో జత చేసి ఈ కారు ఏ డిపార్ట్‌మెంట్‌కు చెందిందో కనుక్కుని అక్కడికి రిజిస్టర్డ్‌ పోస్టులో పంపండి. మరో రిసీట్‌ కార్బన్‌ కాపీలు మిస్‌లీనియస్‌ జనరల్‌ మేనేజర్‌ గారికి సర్టిఫికెట్‌ ఆఫ్‌ పోస్టింగ్‌లో పంపండి. తక్కిన మూడు కాపీలు…. అక్కడి దాకా చదివిన పోలీసు ఇక చదవడం ఆపేసి కాలికి బుద్ధి చెప్పాడు.
************
రుణం… రూపం
పేషెంట్‌: డాక్టర్‌ గారూ! మీరు దయతో నా ఆరోగ్యం బాగుపరిచారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను?
డాక్టర్‌: దాందేముంది? చెక్కుద్వారా, లేదా మనియార్డర్‌ ద్వారా లేదా క్యాష్‌ ఇచ్చినా ఫరవాలేదు.

Tags:    
Advertisement

Similar News