విమానం టాయిలెట్‌లో 48 లక్షల బంగారం స్వాధీనం

భ‌య‌ప‌డ్డారో… ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది త‌ర్వాత అందించే ఒప్పందం ఉందో తెలీదుగాని… ఓ విమానంలో దాదాపు కిలోన్న‌ర పైగా బంగారాన్ని వ‌దిలేసి వెళ్ళిపోయాడో వ్య‌క్తి.  సింగపూర్‌ నుంచి చెన్నై వచ్చిన జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానం టాయిలెట్‌లో దాచిన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.48 లక్షలు. ప్రయాణికులు దిగిపోయిన అనంతరం ముంబైకి బయలుదేరే ముందు ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది విమానాన్ని శుభ్రం చేసే పని చేపట్టారు. టాయిలెట్‌లో ఓ బ్యాగ్‌ ఉండటాన్ని గమనించి ఫిర్యాదు […]

Advertisement
Update:2015-04-07 04:27 IST
భ‌య‌ప‌డ్డారో… ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది త‌ర్వాత అందించే ఒప్పందం ఉందో తెలీదుగాని… ఓ విమానంలో దాదాపు కిలోన్న‌ర పైగా బంగారాన్ని వ‌దిలేసి వెళ్ళిపోయాడో వ్య‌క్తి. సింగపూర్‌ నుంచి చెన్నై వచ్చిన జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానం టాయిలెట్‌లో దాచిన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.48 లక్షలు. ప్రయాణికులు దిగిపోయిన అనంతరం ముంబైకి బయలుదేరే ముందు ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది విమానాన్ని శుభ్రం చేసే పని చేపట్టారు. టాయిలెట్‌లో ఓ బ్యాగ్‌ ఉండటాన్ని గమనించి ఫిర్యాదు చేయడంతో భద్రతాధికారులు తనిఖీ చేయగా బంగారం బయటపడింది. 1.6 కిలోలున్న ఆ బంగారం విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.48 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.-పీఆర్‌
Tags:    
Advertisement

Similar News