జర నవ్వండి ప్లీజ్ 34

ఉపన్యాసం రాజకీయ నాయకుడు ఊకదంపుడు ఉప న్యాసం ఇస్తున్నాడు. ”మనరాష్ట్రంలో వంద జైళ్ళు ఉన్నాయి. నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఒక్క దాంట్లో ఎప్పుడూ లేం” అన్నాడు. సభలోంచి ఎవరో ”ఏ ఒక్క దాంట్లో” అని అరిచారు. ************ కాలేజీ చదువు ”మా వాడు హైదరాబాద్‌లో చదువుతున్నాడు.” ”మా వాడు అక్కడే ఉన్నాడు.” ”మా వాడి ఉత్తరం వచ్చినప్పుడల్లా నేను డిక్షనరీ కోసం వెళ్ళాల్సి వస్తోంది.” ”అదృష్టవంతులు. మావాడి ఉత్తరం అంది నప్పుడల్లా నేను […]

Advertisement
Update:2015-04-07 00:30 IST

ఉపన్యాసం
రాజకీయ నాయకుడు ఊకదంపుడు ఉప న్యాసం ఇస్తున్నాడు. ”మనరాష్ట్రంలో వంద జైళ్ళు ఉన్నాయి. నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఒక్క దాంట్లో ఎప్పుడూ లేం” అన్నాడు. సభలోంచి ఎవరో ”ఏ ఒక్క దాంట్లో” అని అరిచారు.
************
కాలేజీ చదువు
”మా వాడు హైదరాబాద్‌లో చదువుతున్నాడు.”
”మా వాడు అక్కడే ఉన్నాడు.”
”మా వాడి ఉత్తరం వచ్చినప్పుడల్లా నేను డిక్షనరీ కోసం వెళ్ళాల్సి వస్తోంది.”
”అదృష్టవంతులు. మావాడి ఉత్తరం అంది నప్పుడల్లా నేను బ్యాంకుకు వెళ్ళాల్సి వస్తోంది.”
************
హనీమూన్‌
శేఖర్‌ సూట్‌కేసుతో నాంపల్లి స్టేషన్‌లో కనిపించగానే మిత్రుడు నరేష్‌ పలకరించాడు. ”ఎక్కడికి వెళుతున్నావు?” అన్నాడు నరేష్‌. ”ఊటీకి హనీమూన్‌ వెళుతున్నా” అన్నాడు శేఖర్‌. ”మరి మీ ఆవిడ ఏదీ?” ”మా ఆవిడ ఊటీ చూసిందట. అందుకని ఒక్కణ్ణే వెళుతున్నా”.
************
బస్సు పందెం
నాన్నా గుర్రాలు వేగంగా పరిగెడతాయా? బస్సులు వేగంగా వెళతాయా?”
”బస్సులే వెళతాయి”
”మరి నువ్వు బస్సుల మీద కాయకుండా గుర్రాల మీద పందెమెందుకు కాస్తావు?”

Tags:    
Advertisement

Similar News