డ‌బ్బుల‌క‌యితే మ‌ట్టి మాకొద్దంటున్న రైతులు

డ‌బ్బులిచ్చి మ‌ట్టి తోలించుకునేంత స్థోమ‌త త‌మ‌కు లేద‌ని రైతులు అంటున్నారు. మిషన్‌ కాకతీయ పనుల్లో భాగంగా చెరువు మట్టిని పొలాలకు తోలుకోవడానికి త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని, అయితే డ‌బ్బులు ఇచ్చి తాము మ‌ట్టిని తోలించుకోమంటే త‌మ వ‌ల్ల కాద‌ని  రైతులు  అంటున్నారు. చెరువు మట్టి తోలకం ఉచితమైతే సరేనని, అస‌లే క‌ష్టాల్లో ఉండే త‌మ‌కు డ‌బ్బులెక్క‌డి నుంచి వ‌స్తాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌భుత్వం ఒక వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. ఇందులో రైతు సంక్షేమం ఉంది. కాని అన్న‌దాత‌ల్ని […]

Advertisement
Update:2015-04-07 04:21 IST
డ‌బ్బులిచ్చి మ‌ట్టి తోలించుకునేంత స్థోమ‌త త‌మ‌కు లేద‌ని రైతులు అంటున్నారు. మిషన్‌ కాకతీయ పనుల్లో భాగంగా చెరువు మట్టిని పొలాలకు తోలుకోవడానికి త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని, అయితే డ‌బ్బులు ఇచ్చి తాము మ‌ట్టిని తోలించుకోమంటే త‌మ వ‌ల్ల కాద‌ని రైతులు అంటున్నారు. చెరువు మట్టి తోలకం ఉచితమైతే సరేనని, అస‌లే క‌ష్టాల్లో ఉండే త‌మ‌కు డ‌బ్బులెక్క‌డి నుంచి వ‌స్తాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌భుత్వం ఒక వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. ఇందులో రైతు సంక్షేమం ఉంది. కాని అన్న‌దాత‌ల్ని ఇబ్బందులు పెట్టే ఇటువంటి చ‌ర్య‌లు ప్ర‌భుత్వ ఇమేజ్‌ను దెబ్బ‌తీస్తాయ‌ని వారు అంటున్నారు. ఖమ్మం జిల్లా ములకలపల్లి గ్రామంలో కిష్టమ్మ చెరువు పనులు వారం రోజులుగా జరుగుతున్నాయి. చెరువులోని మట్టిని పొలాలకు తొలుకునేందుకు రైతులు ఆసక్తి చూపారు. అయితే రవాణ చార్జీలు రైతులే భరించాలని కాంట్రాక్టర్‌ చెప్పడంతో మట్టి తరలింపుకు రైతులు స‌సేమిరా అంటున్నారు.-పీఆర్‌
Tags:    
Advertisement

Similar News