జర నవ్వండి ప్లీజ్ 32

చెట్టుకవి ప్రఖ్యాతకవి ఇస్మాయిల్‌ ‘చెట్టుకవి’గా ప్రసిద్ధుడు. ”పాపం ఇతను ‘పొయెట్రీ’లో ‘ట్రీ’ ఒక్కటీ ముఖ్యం అనుకున్నాడు” అన్నారు ‘వరద’. ************ మంచిపని మాకు పిల్లల్లేరని కొందరు జాలిపడితే, ”మేమిద్దరం దేశానికి చేసినసేవ ఇదొక్కటే – జనాభాని పెంచకపోవడం, మా కన్నా బుద్ధిలేని వాళ్ళని పుట్టించకపోవడం” అన్నారు. ************ ‘శబ్దరత్నాకరం’ న్యూఢిల్లీలో వరద రాజేశ్వరరావుగారు చాలాకాలం పాటు నివసించిన ఇల్లు ”15 పూసారోడ్‌” ప్రధానమార్గం పక్కన ఉండేది. ఆ మార్గాన నిరంతరం పోయే వాహనాలు చేసే శబ్డాల వల్ల […]

Advertisement
Update:2015-04-06 00:31 IST

చెట్టుకవి

ప్రఖ్యాతకవి ఇస్మాయిల్‌ ‘చెట్టుకవి’గా ప్రసిద్ధుడు. ”పాపం ఇతను ‘పొయెట్రీ’లో ‘ట్రీ’ ఒక్కటీ ముఖ్యం అనుకున్నాడు” అన్నారు ‘వరద’.

************
మంచిపని

మాకు పిల్లల్లేరని కొందరు జాలిపడితే, ”మేమిద్దరం దేశానికి చేసినసేవ ఇదొక్కటే – జనాభాని పెంచకపోవడం, మా కన్నా బుద్ధిలేని వాళ్ళని పుట్టించకపోవడం” అన్నారు.

************
‘శబ్దరత్నాకరం’

న్యూఢిల్లీలో వరద రాజేశ్వరరావుగారు చాలాకాలం పాటు నివసించిన ఇల్లు ”15 పూసారోడ్‌” ప్రధానమార్గం పక్కన ఉండేది. ఆ మార్గాన నిరంతరం పోయే వాహనాలు చేసే శబ్డాల వల్ల ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండేది కాదు. అయినా అది ఆయనకు చాలా నచ్చిన ఇల్లు. దానికి ఆయన ముద్దుగా ‘శబ్దరత్నాకరం’ అని పేరు పెట్టారు.

************
”సావనీరు….”

మరో మేనకోడలు – మా ఆడపడుచు కూతురు నృత్య ప్రదర్శనకి చేస్తున్న ఏర్పాట్లలో ‘సావనీర్‌’ ప్రచురించటం ఆలస్యం అయింది. చీటికీ మాటికీ మా ఆడబడుచూ వాళ్లూ ‘సావనీర్‌’ ఎంత వరకు వచ్చిందో అడుగుతూంటే విసుక్కుం టూ ”వీళ్లు నన్ను సావనీరు, బతకనీరు” అన్నారు!

Tags:    
Advertisement

Similar News