జర నవ్వండి ప్లీజ్ 26
ధైర్యం టీచర్: రీటా! మీరు భోజనానికి ముందు ప్రార్థన చేస్తారా! రీటా: చెయ్యం టీచర్! మా అమ్మ వంట బాగానే వండుతుంది. ************ రూలంటే రూలే! లోపల మీటింగ్ జరుగుతోంది. ఒకతను లోపలికి రాబోతే గేటు దగ్గరున్న వ్యక్తి ‘మీరు మీ గొడుగు బయట పెట్టిరండి’ అన్నాడు. ఆ వ్యక్తి ‘అయ్యా! నా దగ్గర గొడుగు లేదు’ అన్నాడు ఐతే మీరు లోపలికి వెళ్లడానికి వీల్లేదు’ అన్నాడు. ఆ వ్యక్తి ‘ఎందుకు?’ అన్నాడు. ”రూలురూలే! మా బాస్ […]
ధైర్యం
టీచర్: రీటా! మీరు భోజనానికి ముందు ప్రార్థన చేస్తారా!
రీటా: చెయ్యం టీచర్! మా అమ్మ వంట బాగానే వండుతుంది.
************
రూలంటే రూలే!
లోపల మీటింగ్ జరుగుతోంది. ఒకతను లోపలికి రాబోతే గేటు దగ్గరున్న వ్యక్తి ‘మీరు మీ గొడుగు బయట పెట్టిరండి’ అన్నాడు.
ఆ వ్యక్తి ‘అయ్యా! నా దగ్గర గొడుగు లేదు’ అన్నాడు
ఐతే మీరు లోపలికి వెళ్లడానికి వీల్లేదు’ అన్నాడు.
ఆ వ్యక్తి ‘ఎందుకు?’ అన్నాడు.
”రూలురూలే! మా బాస్ ఎవరు వచ్చినా గొడుగు ఆ మూల పెట్టి లోపలికి వెళ్లామన్నాడు. మీరు యింటికి వెళ్లి గొడుగు తెచ్చి ఆ మూల పెడితే కానీ మిమ్ముల్ని లోపలికి పంపను” అన్నాడు
************
డబ్బే తెలివి
ఒక వ్యక్తి న్యూయార్క్‌లో సన్నని వీధి గుండా రాత్రి పూట వెళుతూ వుంటే ఒక దొంగ హఠాత్తుగా వచ్చి అతని తలకు పిస్టల్ ఆనించి ‘నీ దగ్గరున్న డబ్బంతా యిచ్చెయ్! లేకుంటే నీ మెదడు చిట్లిపోయేలా కాల్చేస్తాను’ అన్నాడు.
దానికి ఆ వ్యక్తి ‘నోప్రాబ్లం! అమెరికాలో మెదడు లేకుండా బతకవచ్చు కానీ డబ్బు లేకుండా బ్రతకలేం’ అన్నాడు.
************
డాక్టర్‌తో చావు
డాక్టర్ పేషెంట్‌ని పరీక్షించి సీరియస్‌గా లేచి పక్కనే నిల్చున్న పేషెంట్ భార్యతో ‘అయామ్ సారీ! అతను చనిపోయినట్లున్నాడు’ అన్నాడు
పేషెంట్ సన్నని స్వరంతో ‘లేదు నేను బతికేవున్నాను’ అన్నాడు పేషెంట్ భార్య ‘మీరు వూరుకోండి ఆరోగ్యం గురించి మీకన్నా డాక్టర్ గారికే బాగా తెలుస్తుంది’ అంది.