గల్ఫ్ పేరు చెప్పి రూ. 70 లక్షలతో ఉడాయించిన ఏజెంట్లు!
పశ్చిమగోదావరి జిల్లాలో కొంతమంది గల్ఫ్ ఏజెంట్లు మోసానికి 46 మంది యువకులు బలైపోయారు. తాము సౌదీ అరేబియా, దుబాయిల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నర్సాపురం సమీపంలోని మొగల్తూరు గ్రామంలో ఒక్కొక్కరి నుంచి లక్షన్నర చొప్పున వసూలు చేశారు. దాదాపు 70 లక్షలు వసూలు చేసిన తర్వాత వీరందరినీ ముంబాయికి తరలించారు. అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు పంపిస్తామని నమ్మించి వారిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఎన్ని గంటలు పడిగాపులు కాసినా ఎవరూ రాకపోవడంతో తాము మోసపోయామని తెలుసుకున్న […]
Advertisement
పశ్చిమగోదావరి జిల్లాలో కొంతమంది గల్ఫ్ ఏజెంట్లు మోసానికి 46 మంది యువకులు బలైపోయారు. తాము సౌదీ అరేబియా, దుబాయిల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నర్సాపురం సమీపంలోని మొగల్తూరు గ్రామంలో ఒక్కొక్కరి నుంచి లక్షన్నర చొప్పున వసూలు చేశారు. దాదాపు 70 లక్షలు వసూలు చేసిన తర్వాత వీరందరినీ ముంబాయికి తరలించారు. అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు పంపిస్తామని నమ్మించి వారిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఎన్ని గంటలు పడిగాపులు కాసినా ఎవరూ రాకపోవడంతో తాము మోసపోయామని తెలుసుకున్న యువకులు తిరిగి నర్సాపురం చేరుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. నిందితులను పట్టుకుని తమ డబ్బులు తమకు ఇప్పించాలని, నమ్మించి మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండు చేశారు.-పీఆర్
Advertisement