జర నవ్వండి ప్లీజ్ 24
మమ్మీ షీలా: డాడీ! నువ్వెప్పుడైనా ఈజిప్టు వెళ్ళావా? తండ్రి: లేదు. ఎందుకడిగావు? షీలా: మరయితే ‘మమ్మీ’ని ఎక్కణ్ణించి తెచ్చావు? ************ విశాలహృదయం ‘నీ లవర్‌ది చాలా పెద్ద మనసు’ ‘నీ కెలా తెలుసు?’ ‘ఇప్పటికే పెళ్ళి చేసుకుంటానని యిద్దరికి ప్రామిస్ చేశాడు. ************ పరిశోధన విశాల్: నేను అమెరికాలో రీసెర్చి స్కాలర్‌ని. సుబ్బారావు: అమెరికాలో నువ్వు ఏం పరిశోధన చేస్తావు? విశాల్: కప్పల మీద పరిశోధన చేస్తాను సుబ్బారావు: మన మురిక్కాలువలోని కప్పల పైన పరిశోధనకు అమెరికా […]
మమ్మీ
షీలా: డాడీ! నువ్వెప్పుడైనా ఈజిప్టు వెళ్ళావా?
తండ్రి: లేదు. ఎందుకడిగావు?
షీలా: మరయితే ‘మమ్మీ’ని ఎక్కణ్ణించి తెచ్చావు?
************
విశాలహృదయం
‘నీ లవర్‌ది చాలా పెద్ద మనసు’
‘నీ కెలా తెలుసు?’
‘ఇప్పటికే పెళ్ళి చేసుకుంటానని యిద్దరికి ప్రామిస్ చేశాడు.
************
పరిశోధన
విశాల్: నేను అమెరికాలో రీసెర్చి స్కాలర్‌ని.
సుబ్బారావు: అమెరికాలో నువ్వు ఏం పరిశోధన చేస్తావు?
విశాల్: కప్పల మీద పరిశోధన చేస్తాను
సుబ్బారావు: మన మురిక్కాలువలోని కప్పల పైన పరిశోధనకు అమెరికా వెళ్ళాలా?’ అన్నాడు
************
ఈర్ష్య
‘అతను నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్ముతున్నా వా?’
‘అవును’
‘ఎట్లు చెబుతావు?’
‘నా స్విమ్మింగ్ డ్రస్ అతనికి నచ్చలేదు’