ఆమ్ ఆద్మీలో రాజకీయ ప్రకంపనలు
ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో అఖండ మెజారిటీతో అధికారం అయితే దక్కినా ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు మనఃశ్శాంతి దక్కడం లేదు. మొన్నటి వరకూ తీవ్ర ఆనారోగ్యంతో బాధ పడిన కేజ్రీవాల్ ప్రకృతి వైద్యం చేయించుకుని శారీరకంగా స్థిమిత పడినా, పార్టీలోని లుకలుకలు ఆయన్ను మానసికంగా చాలా ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ఆప్ నాయకులందరూ సమావేశమై పార్టీలో ఇప్పటివరకు కీలక పాత్రని పోషించిన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను పార్టీ నుంచి బహిష్కరించడం నిజంగా పెద్ద కుదుపే. […]
Advertisement
ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో అఖండ మెజారిటీతో అధికారం అయితే దక్కినా ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు మనఃశ్శాంతి దక్కడం లేదు. మొన్నటి వరకూ తీవ్ర ఆనారోగ్యంతో బాధ పడిన కేజ్రీవాల్ ప్రకృతి వైద్యం చేయించుకుని శారీరకంగా స్థిమిత పడినా, పార్టీలోని లుకలుకలు ఆయన్ను మానసికంగా చాలా ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ఆప్ నాయకులందరూ సమావేశమై పార్టీలో ఇప్పటివరకు కీలక పాత్రని పోషించిన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను పార్టీ నుంచి బహిష్కరించడం నిజంగా పెద్ద కుదుపే. పార్టీకి ఎంతో సేవ చేసిన ఈ ఇద్దరినీ గెంటేయడం పట్ల వారి మద్దతుదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న ప్రముఖ సామాజికవేత్త మేధా పాట్కర్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. ఇది కూడా ఆప్ నేతకు పెద్ద షాకే. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కేజ్రీవాల్‌కి మద్దతుగా నిలిచిన ఆమె ఇప్పుడు పార్టీకి వీడ్కోలు చెప్పేశారు. మేధా పాట్కర్ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికలలో పోటీ కూడా చేశారు. ఆమెకు డిపాజిట్ దక్కకపోయినా నాయకులు ఎప్పుడూ ఆమెను చిన్నచూపు చూడలేదు. అయినా పాట్కర్ పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఆమ్ ఆద్మీకి ఇబ్బంది కలిగించే పరిణామమే.-పిఆర్
Advertisement