టి.టి.డీ. వార్షిక బ‌డ్జెట్ రూ. 2530 కోట్లు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టి.టి.డి.) త‌న వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఆర్ధిక సంవ‌త్స‌రంలో ఈ బ‌డ్జెట్ 2,530 కోట్లుగా ఉంటుంద‌ని తెలిపింది. ఈ ఆర్ధిక సంవ‌త్స‌రంలో దేవ‌స్థానానికి త‌ల‌నీలాల ద్వారా 200 కోట్ల రూపాయ‌లు, స్పెష‌ల్‌, శీఘ్ర ద‌ర్శ‌నాల ద్వారా 170 కోట్ల రూపాయ‌లు ఆదాయం వ‌చ్చిన‌ట్టు తెలిపింది. శ్రీ‌వారి హుండీ కానుక‌ల ద్వ‌రా దాద‌పు 905 కోట్ల రూపాయ‌లు వ‌చ్చిన‌ట్టు టి.టి.డి. అధికారులు తెలిపారు. శ్రీ‌వారికి బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లపై యేటా వ‌డ్డీ వ‌స్తుంద‌ని, […]

Advertisement
Update:2015-03-27 11:38 IST
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టి.టి.డి.) త‌న వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఆర్ధిక సంవ‌త్స‌రంలో ఈ బ‌డ్జెట్ 2,530 కోట్లుగా ఉంటుంద‌ని తెలిపింది. ఈ ఆర్ధిక సంవ‌త్స‌రంలో దేవ‌స్థానానికి త‌ల‌నీలాల ద్వారా 200 కోట్ల రూపాయ‌లు, స్పెష‌ల్‌, శీఘ్ర ద‌ర్శ‌నాల ద్వారా 170 కోట్ల రూపాయ‌లు ఆదాయం వ‌చ్చిన‌ట్టు తెలిపింది. శ్రీ‌వారి హుండీ కానుక‌ల ద్వ‌రా దాద‌పు 905 కోట్ల రూపాయ‌లు వ‌చ్చిన‌ట్టు టి.టి.డి. అధికారులు తెలిపారు. శ్రీ‌వారికి బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లపై యేటా వ‌డ్డీ వ‌స్తుంద‌ని, ఈ యేడాది కూడా 719 కోట్ల రూపాయ‌లు వ‌డ్డీగా వ‌చ్చింద‌ని అధికారులు చెప్పారు. -పి.ఆర్‌.
Tags:    
Advertisement

Similar News