వీఐపీలకూ నీటి కోత విధించండి: కేజ్రీవాల్‌

‘‘నీటి కొరత ఉంటే సామాన్య ప్రజలకు మాత్రమే కాదు.. వీఐపీలకు కూడా పెట్టండి. రాష్ట్రపతి, ప్రధాని మినహా కేంద్ర, రాష్ట్రాల మంత్రులు.. నాతో సహా మొత్తం వీఐపీలందరికీ కోత దెబ్బ తగలాల్సిందే’’.. అని ఢిల్లీ జల మండలికి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎకాఎకిన అసెంబ్లీలోనే ప్రకటన చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో నీటి కొరత అంశం చర్చకు వచ్చినప్పుడు ఆయన ఈ సూచన చేశారు. నీటి కొరతను కేవలం ఢిల్లీలోని సామాన్య ప్రజలు మాత్రమే ఎందుకు ఎదుర్కొవాలి? ప్రయోజనాలు […]

Advertisement
Update:2015-03-27 07:35 IST

‘‘నీటి కొరత ఉంటే సామాన్య ప్రజలకు మాత్రమే కాదు.. వీఐపీలకు కూడా పెట్టండి. రాష్ట్రపతి, ప్రధాని మినహా కేంద్ర, రాష్ట్రాల మంత్రులు.. నాతో సహా మొత్తం వీఐపీలందరికీ కోత దెబ్బ తగలాల్సిందే’’.. అని ఢిల్లీ జల మండలికి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎకాఎకిన అసెంబ్లీలోనే ప్రకటన చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో నీటి కొరత అంశం చర్చకు వచ్చినప్పుడు ఆయన ఈ సూచన చేశారు. నీటి కొరతను కేవలం ఢిల్లీలోని సామాన్య ప్రజలు మాత్రమే ఎందుకు ఎదుర్కొవాలి? ప్రయోజనాలు అందరూ పంచుకుంటున్నప్పుడు కష్టాలు పేదలే పంచుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు. నీటిని పంచుకునే విషయంలో ఢిల్లీతో కలిసి రావట్లేదంటూ హర్యానా రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అలాగే.. ‘బీజేపీ ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ నష్టాలే’ అని విమర్శించారు. ‘‘బీజేపీ నేతృత్వంలోని కార్పొరేషన్లు తమ సిబ్బందికి జీతాలివ్వలేని పరిస్థితి ఉంటే అక్కడ పాలన తమకు అప్పగిస్తే పరిపాలన సజావుగా నిర్వహిస్తా’మని ఆయన అన్నారు. తాము ఏడాదిలో వాటిని లాభాల బాట పట్టిస్తాం’’ అన్నారు. – పి.ఆర్‌.

Tags:    
Advertisement

Similar News