జర నవ్వండి ప్లీజ్ 12
ఫ్రీ ఆఫర్ ఒకావిడ తనకు మొగుడు కావాలంటూ పత్రికల్లో ప్రకటన ఇచ్చింది. దానికి బదులుగా కుప్పలుతెప్పలుగా ఉత్తరాలు వచ్చి పడ్డాయి. వాటన్నిటిలో సారాంశం ఒక్కటే ‘నా మొగుడ్ని తీసుకో’ ************ స్వయంగా ”గోపీ! మీ ఆవు పాలిస్తుందా?” అడిగాడు మాస్టారు. ”అదివ్వదు సార్ మనమే పితుక్కోవాలి” అన్నాడు గోపి. ************ ఒక్కదాన్నే కాబోయే అల్లుడిని పిల్ల తండ్రి అడిగాడు. ”బాబూ ఒక కుటుంబాన్ని పోషించగల స్థోమతుందా?” దానికి అబ్బాయి ”లేదండీ! నేను కేవలం మీ అమ్మాయి పోషణ […]
ఫ్రీ ఆఫర్
ఒకావిడ తనకు మొగుడు కావాలంటూ పత్రికల్లో ప్రకటన ఇచ్చింది. దానికి బదులుగా కుప్పలుతెప్పలుగా ఉత్తరాలు వచ్చి పడ్డాయి. వాటన్నిటిలో సారాంశం ఒక్కటే ‘నా మొగుడ్ని తీసుకో’
************
స్వయంగా
”గోపీ! మీ ఆవు పాలిస్తుందా?” అడిగాడు మాస్టారు.
”అదివ్వదు సార్ మనమే పితుక్కోవాలి” అన్నాడు గోపి.
************
ఒక్కదాన్నే
కాబోయే అల్లుడిని పిల్ల తండ్రి అడిగాడు. ”బాబూ ఒక కుటుంబాన్ని పోషించగల స్థోమతుందా?”
దానికి అబ్బాయి ”లేదండీ! నేను కేవలం మీ అమ్మాయి పోషణ చూసుకోగలను.
మీ సంగతి మీరే చూసుకోవాలి” అన్నాడు కచ్చితంగా.
************
కారణం
ఒకరు అడిగారు
”నువ్వు బ్రహ్మచారిగానే ఎందుకు ఉండిపోయావు?” ”మా అత్తగారికీ, మామగారికీ పిల్లలు పుట్టలేదు మరి”.