ప్రపంచకప్‌ ఫైనల్‌లో న్యూజీలాండ్‌

సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడిన న్యూజిలాండ్‌ అనూహ్యంగా ప్రపంచ కప్‌ ఫైనల్‌కు చేరుకుంది. వర్షం కారణంగా డక్‌వర్త్‌ లుయీస్‌ పద్దతిలో నాలుగు వికెట్ల తేడాతో కివీస్‌ ఈ విజయం సొంతం చేసుకుంది. వరుణుడి శాపమో… లేక స్వయంకృతమో కాని చివరి బంతి వరకు ఆశలతో పోరాడిన దక్షిణాఫ్రికన్లు ఇలియట్‌ కొట్టిన సిక్సర్‌తో ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. కివీస్‌ను ఫైనల్‌కి చేర్చడంలో 84 రన్‌లు చేసిన ఇలియట్‌ నాటౌట్‌గా మిగిలి కీలకపాత్ర వహించాడు. ఇలియట్‌కు ప్లేయర్‌ ఆప్ ది […]

Advertisement
Update:2015-03-24 11:04 IST

సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడిన న్యూజిలాండ్‌ అనూహ్యంగా ప్రపంచ కప్‌ ఫైనల్‌కు చేరుకుంది. వర్షం కారణంగా డక్‌వర్త్‌ లుయీస్‌ పద్దతిలో నాలుగు వికెట్ల తేడాతో కివీస్‌ ఈ విజయం సొంతం చేసుకుంది. వరుణుడి శాపమో… లేక స్వయంకృతమో కాని చివరి బంతి వరకు ఆశలతో పోరాడిన దక్షిణాఫ్రికన్లు ఇలియట్‌ కొట్టిన సిక్సర్‌తో ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. కివీస్‌ను ఫైనల్‌కి చేర్చడంలో 84 రన్‌లు చేసిన ఇలియట్‌ నాటౌట్‌గా మిగిలి కీలకపాత్ర వహించాడు. ఇలియట్‌కు ప్లేయర్‌ ఆప్ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. 43 ఓవర్లలో దక్షిణాఫ్రికా 281 పరుగులు చేసింది. కాని వర్షం కారణంగా డక్‌వర్త లుయీస్‌ పద్ధతిలో న్యూజిలాండ్‌కు 298 లక్ష్యం ఖరారైంది. నిజానికి ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఫీల్డింగ్‌ సరిగా ఉంటే ఖచ్చితంగా గెలిచి ఉండేది. ఒత్తిడిని జయించలేని దక్షిణాఫ్రికా ఆటగాళ్ళు ఫీల్డింగ్‌లో 4 క్యాచ్‌లు, 3 రన్‌ అవుట్‌లను చేతులారా వదిలేసి తగిన మూల్యం చెల్లించుకున్నారు. విశేషమేమంటే ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ న్యూజీలాండ్‌ విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఆరుసార్లు సెమీస్‌ వరకు వెళ్ళి చతికిలపడిన న్యూజీలాండ్‌ ఈసారి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ఈ నెల 29న జరిగే ఫైనల్స్‌లో బి గ్రూపు విజేతతో వీరు తలపడతారు.

Tags:    
Advertisement

Similar News