బ్యాంకులకు వరుస సెలవులు..

ఆర్ధిక అంశాలకు సంబంధించి వాణిజ్య బ్యాంకులపై ఆధారపడే వారు వచ్చే వారం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు బ్యాంకులకు దీర్ఘ కాలిక సెలవులు రానున్నాయి. మార్చి 28న శ్రీరామ నవమి, మార్చి 29, ఏప్రిల్ ఒకటో తేదీల్లో అకౌంట్స్ క్లోజింగ్ సందర్భంగా బ్యాంకులు సెలవు పాటించనున్నాయి. అలాగే మార్చి 30, 31 తేదీల్లో కొన్ని బ్యాంకులు పని చేస్తాయి. ఇక […]

Advertisement
Update:2015-03-24 06:26 IST

ఆర్ధిక అంశాలకు సంబంధించి వాణిజ్య బ్యాంకులపై ఆధారపడే వారు వచ్చే వారం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు బ్యాంకులకు దీర్ఘ కాలిక సెలవులు రానున్నాయి. మార్చి 28న శ్రీరామ నవమి, మార్చి 29, ఏప్రిల్ ఒకటో తేదీల్లో అకౌంట్స్ క్లోజింగ్ సందర్భంగా బ్యాంకులు సెలవు పాటించనున్నాయి. అలాగే మార్చి 30, 31 తేదీల్లో కొన్ని బ్యాంకులు పని చేస్తాయి. ఇక ఏప్రిల్ 2న మహావీర్ జయంతి, ఏప్రిల్ 3న గుడ్‌ ఫ్రైడే సందర్భంగా బ్యాంకులకు మళ్లీ సెలవులు రానున్నాయి. ఏప్రిల్ 4న శనివారం బ్యాంకులు పని చేసినా ఒక పూట మాత్రమే ఉంటాయి. ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 5న ఆదివారం మళ్లీ సెలవు రానుంది. వరుస సెలవుల నేపథ్యంలో కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు వర్గాలు సూచిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News