జర నవ్వండి ప్లీజ్ 5

రీ’ఫ్రెష్‌’ ”పోయిన వారం మీ దగ్గర కొన్న స్వీట్స్‌ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి” అన్నాడు కస్టమర్‌ ”అవి ఇంకా ఉన్నాయి. మరో కేజీ ఇమ్మంటారా” అడిగాడు షాపు ఓనర్‌ ************ ‘ఈత’రం భార్య జనార్దన్‌: భర్తకు తగ్గ భార్య అంటే… ఎలాగుంటుందిరా! శివకుమార్‌: ”ఈ సంసారాన్ని ఈదలేక చస్తున్నా” అని భర్త అంటే… ”ఈత రాని వాడ్ని కట్టుకున్నాను నా ఖర్మ” అని ఏడిచేది! ************ కొడితే తిట్టనా ”మీ ఆయన నిన్ను రోజూ కొడతారట నిజమేనా!” […]

Advertisement
Update:2015-03-23 01:30 IST

రీ’ఫ్రెష్‌’
”పోయిన వారం మీ దగ్గర కొన్న స్వీట్స్‌ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి” అన్నాడు కస్టమర్‌ ”అవి ఇంకా ఉన్నాయి. మరో కేజీ ఇమ్మంటారా” అడిగాడు షాపు ఓనర్‌
************
‘ఈత’రం భార్య జనార్దన్‌: భర్తకు తగ్గ భార్య అంటే… ఎలాగుంటుందిరా! శివకుమార్‌: ”ఈ సంసారాన్ని ఈదలేక చస్తున్నా” అని భర్త అంటే… ”ఈత రాని వాడ్ని కట్టుకున్నాను నా ఖర్మ” అని ఏడిచేది!
************
కొడితే తిట్టనా
”మీ ఆయన నిన్ను రోజూ కొడతారట నిజమేనా!” అడిగింది శ్యామల.
”నేను రోజూ తిడతాను. నేను తిట్టినందుకు కొడతాడో ఆయన కొట్టినందుకు తిడతానో, చెప్పలేను..” అంది పద్మ.
************
సౌండ్‌లో గొడవ
”మీ ఇంట్లో టీవీ సౌండ్‌ కొద్దిగా తగ్గించాలి” అన్నాడు రమణ ”ఏం…! నేనూ నా భార్యా పోట్లాడుకుంటే విందామనా” ప్రశ్నించాడు శ్రీనివాస్‌

Tags:    
Advertisement

Similar News