జర నవ్వండి ప్లీజ్‌!

ఇద్దరూ ఇద్దరే.. (ఇద్దరు చెవిటి వాళ్ల మధ్య సంభాషణ) రాజారావు: గుడికి వెళ్తున్నారా! జోగునాథం గారూ? జోగునాథం: అబ్బే లేదండీ! ఇంత పొద్దున్నే అక్కడికి ఎందుకు వెళ్తాను. నేను గుడికి వెళ్తున్నాను. రాజారావు: ఇంత పొద్దున వెళ్తున్నారు కదా! గుడికి వెళ్తున్నారనుకున్నాను. ********************** ఇల్లు కట్టి చూడు రామమూర్తి: ఇల్లెలా కట్టావ్‌? వెంకటరావు: అప్పు చేసి… రామమూర్తి: మరి అప్పు ఎలా తీర్చావ్‌? వెంకటరావు: ఇంటిని అమ్మేసి! ********************** విచారం రమణ: నీ జుట్టు ఊడిపోవడానికి కారణం? […]

Advertisement
Update:2015-03-21 07:08 IST

ఇద్దరూ ఇద్దరే.. (ఇద్దరు చెవిటి వాళ్ల మధ్య సంభాషణ)
రాజారావు: గుడికి వెళ్తున్నారా! జోగునాథం గారూ?
జోగునాథం: అబ్బే లేదండీ! ఇంత పొద్దున్నే అక్కడికి ఎందుకు వెళ్తాను. నేను గుడికి వెళ్తున్నాను.
రాజారావు: ఇంత పొద్దున వెళ్తున్నారు కదా! గుడికి వెళ్తున్నారనుకున్నాను.

**********************

ఇల్లు కట్టి చూడు
రామమూర్తి: ఇల్లెలా కట్టావ్‌?
వెంకటరావు: అప్పు చేసి…
రామమూర్తి: మరి అప్పు ఎలా తీర్చావ్‌?
వెంకటరావు: ఇంటిని అమ్మేసి!

**********************

విచారం
రమణ: నీ జుట్టు ఊడిపోవడానికి కారణం?
గిరి: విచారం
రమణ: దేని గురించి?
గిరి: జుట్టు ఊడిపోవడం గురించి…

**********************

కొత్త షి’కారు’
కృష్ణ: వాడేంట్రా! డ్రైవింగ్‌ సీటు నుంచి దిగి భార్య దిగేందుకు వీలుగా డోరు తీస్తున్నాడు?
రాము: కారన్నా కొత్తదయి ఉండాలి..లేదా భార్యన్నా కొత్తదయి ఉండాలి!

Tags:    
Advertisement

Similar News