జర నవ్వండి ప్లీజ్-2
ముందు జాగ్రత్త ఒక డ్రైవర్ విపరీతమైన వేగంతో కారు నడుపుతున్నాడు. యజమాని: ఎందుకంత స్పీడుగా కారు పోనిస్తున్నావు. డ్రైవర్: బ్రేకులు పనిచేయడంలేదు సార్! యజమాని: బ్రేకులు పనిచేయకపోతే ఏదో ఒక విధంగా బండిని ఆపటానికి ప్రయత్నించాలి గానీ స్పీడుగా పోవడమేమిటి? డ్రైవర్: యాక్సిడెంట్ కాకముందే ఇంటికి చేరుకుందామని..! బొట్టు..గుర్తు మధు: ఒరేయ్ శీనూ..గుడిలో భక్తులకు పూజారి బొట్టు ఎందుకురా పెడతాడు? ఉదయ్: ప్రసాదం కోసం మళ్లీ మళ్లీ వచ్చి అడగకుండా.. గుర్తు పెట్టుకోవడానికి వీలుగా బొట్లు పెడతార్రా! […]
ముందు జాగ్రత్త
ఒక డ్రైవర్ విపరీతమైన వేగంతో కారు నడుపుతున్నాడు.
యజమాని: ఎందుకంత స్పీడుగా కారు పోనిస్తున్నావు.
డ్రైవర్: బ్రేకులు పనిచేయడంలేదు సార్!
యజమాని: బ్రేకులు పనిచేయకపోతే ఏదో ఒక విధంగా బండిని ఆపటానికి ప్రయత్నించాలి గానీ స్పీడుగా పోవడమేమిటి?
డ్రైవర్: యాక్సిడెంట్ కాకముందే ఇంటికి చేరుకుందామని..!
బొట్టు..గుర్తు
మధు: ఒరేయ్ శీనూ..గుడిలో భక్తులకు పూజారి బొట్టు ఎందుకురా పెడతాడు?
ఉదయ్: ప్రసాదం కోసం మళ్లీ మళ్లీ వచ్చి అడగకుండా.. గుర్తు పెట్టుకోవడానికి వీలుగా బొట్లు పెడతార్రా!
పితృభాష లేదెందుకో?
చిన్నప్పటి నుంచి మనం మాట్లాడే భాషని మాతృభాష అంటారేకాని పితృభాష అనరెందుకని? డౌటొచ్చింది రాముకు. ఎందుకంటే తండ్రికి మాట్లాడే అవకాశం అతికష్టం మీద లభిస్తుంది కాబట్టి.. డౌట్ క్లియర్ చేశాడు సతీష్.
1..2..3…మైక్ టెస్టింగ్
ఒక సభ జరుగుతోంది. చాలాసేపు ప్రసంగించిన ఓ వక్త స్టేజి దిగాడు. ఆ కార్యక్రమానికి హాజరైన ఓ విదేశీ విలేఖరి ఆ వక్తను ”మీ దేశంలో నాయకులు చాలాసేపు ఉపన్యాసాలిస్తారే” అని అన్నాడు.
అందుకాయన నవ్వుతూ ”మంత్రిగారింకా రాలేదు. ఇప్పటి వరకూ నేను మాట్లాడినదంతా మైక్ టెస్టింగ్ కోసమే అని జవాబిచ్చాడు.