యూపీలో ఘోర రైలు ప్రమాదం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోరమైన రైలు ప్రమాదం జరిగింది. డెహ్రాడూన్‌ నుంచి వారణాసి వెళుతున్న జనతా ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పి 30 మందికి పైగా చనిపోయారు. 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలు బ్రేక్‌ ఫెయిలయిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దుర్ఘటన జరిగిన స్థలానికి 24 వైద్య బృందాలను తరలించినట్టు రైల్వే అధికారులు చెప్పారు. బచ్చరావన్‌ స్టేషన్‌ వద్దకు రాగానే డ్రైవర్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఆపే ప్రయత్నం చేశాడు. కాని బ్రేకులు […]

Advertisement
Update:2015-03-20 10:08 IST

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోరమైన రైలు ప్రమాదం జరిగింది. డెహ్రాడూన్‌ నుంచి వారణాసి వెళుతున్న జనతా ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పి 30 మందికి పైగా చనిపోయారు. 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలు బ్రేక్‌ ఫెయిలయిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దుర్ఘటన జరిగిన స్థలానికి 24 వైద్య బృందాలను తరలించినట్టు రైల్వే అధికారులు చెప్పారు. బచ్చరావన్‌ స్టేషన్‌ వద్దకు రాగానే డ్రైవర్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఆపే ప్రయత్నం చేశాడు. కాని బ్రేకులు ఫెయిలయిన కారణంగా ఇది సాధ్యం కాలేదు. దాంతో అదే వేగంతో ముందుకు వెళ్ళి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 30 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. మరో 150 మంది వరకు గాయపడి ఉండవచ్చని భావిస్తున్నారు. గాయపడిన వారందరినీ సమీపంలోని ఆస్ప్రత్రులకు తరలిస్తున్నారు. మృతులకు రైల్వే 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున ప్రకటించారు. ప్రమాదం కారణంగా రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ దుర్ఘటన గురించి తెలియగానే ప్రధాని మోడి, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌లు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Tags:    
Advertisement

Similar News