Telugu Global
NEWS

కోనసీమకు అంబేద్కర్ పేరు.. ఏపీ కేబినెట్ ఆమోదం

ఏపీ కేబినెట్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కోనసీమ జిల్లాకు `అంబేద్కర్ కోనసీమ జిల్లా`గా పేరు మార్పు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇటీవల ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా పలు జిల్లాలకు ప్రముఖుల పేర్లుపెట్టారు. ఆ క్రమంలో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయి. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును ప్రతిపాదిస్తూ ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ […]

కోనసీమకు అంబేద్కర్ పేరు.. ఏపీ కేబినెట్ ఆమోదం
X

ఏపీ కేబినెట్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కోనసీమ జిల్లాకు 'అంబేద్కర్ కోనసీమ జిల్లా'గా పేరు మార్పు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇటీవల ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా పలు జిల్లాలకు ప్రముఖుల పేర్లుపెట్టారు. ఆ క్రమంలో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయి.

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును ప్రతిపాదిస్తూ ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సరిగ్గా నెల రోజుల క్రితం.. అంటే మే 24న అమలాపురంలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. కోనసీమ పరిరక్షణ సమితి నేతృత్వంలో నిరసనకారులు ప్రైవేటు, ఆర్టీసీ, పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు.

అంతే కాకుండా రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, మమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ కుమార్ ఇళ్లకు నిప్పుపెట్టారు. ఆ రోజు విధ్వంసం సృష్టించిన పలు పార్టీలకు చెందిన 217 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ విధ్వంసం జరిగి నెల రోజులు గడుస్తున్నా.. ఇంకా అమలాపురంలో144 సెక్షన్, 30 సెక్షన్ అమలులో ఉంది. కాగా, మే 18 నుంచి జూన్ 18 వరకు కోనసీమ జిల్లా పేరు మార్పుపై అభ్యంతరాలను స్వీకరించారు. జిల్లాలోని 22 మండలాలకు చెందిన ప్రజల నుంచి అధికారులు అభిప్రాయాలు తెలుసుకున్నారు. దాదాపు 6 వేల మంది ఇందులో పాల్గొనగా.. ఆ రిపోర్టు ప్రభుత్వానికి చేరింది.

ప్రజాభిప్రాయ సేకరణలో అత్యధిక మంది అంబేద్కర్ పేరు వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది. దీంతో ఏపీ ప్రభుత్వం కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడానికి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా పేరు మార్పుపై కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

First Published:  24 Jun 2022 4:04 AM GMT
Next Story