Telugu Global
NEWS

వేతనాల పెంపుకు నిర్మాతల అంగీకారం – సినీ కార్మికుల సమ్మె విరమణ‌

వేతనాలు పెంచాలనే డిమాండ్ తో నిన్నటి నుంచి సమ్మెకు దిగిన తెలుగు సినీ కార్మికులు సమ్మె విరమించారు. రేపటి నుంచి షూటింగులకు హాజరు అవనున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. సినిమటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చొరవతో ఈ రోజు ఇరు వర్గాలు చర్చలు జరిపాయి. 2 గంటల‌ పాటు జరిగిన చర్చల్లో ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చారు. కార్మికుల వేతనాల పెంపు, ఇతర సమస్యలపై దిల్ రాజు అద్వర్యంలో ఓ కమిటీని నియమిస్తున్నట్టు […]

film workers
X

వేతనాలు పెంచాలనే డిమాండ్ తో నిన్నటి నుంచి సమ్మెకు దిగిన తెలుగు సినీ కార్మికులు సమ్మె విరమించారు. రేపటి నుంచి షూటింగులకు హాజరు అవనున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు తెలిపారు.

సినిమటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చొరవతో ఈ రోజు ఇరు వర్గాలు చర్చలు జరిపాయి. 2 గంటల‌ పాటు జరిగిన చర్చల్లో ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చారు.

కార్మికుల వేతనాల పెంపు, ఇతర సమస్యలపై దిల్ రాజు అద్వర్యంలో ఓ కమిటీని నియమిస్తున్నట్టు నిర్మాతల మండలి తెలిపింది. శుక్రవారం నాడు జరిగే సమావేశంలో వేతనాలపై ఒక నిర్ణయం తీసుకుంటామని నిర్మాతల మండలి నాయకులు చెప్పారు. వేతనాల పెంపునకు నిర్మాతలు అంగీకరించడంతో షూటింగులకు రేపటి నుంచి హాజరవుతామని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. ఇతర సమస్యలను సమన్వయ కమిటీ తో చర్చించి పరిష్కరించుకుంటామని వారు చెప్పారు.

First Published:  23 Jun 2022 11:04 AM IST
Next Story