Telugu Global
NEWS

తెలంగాణాలో పెరిగిన కరోనా కేసులు-మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

కరోనా పాజిటీవ్ కేసులు మళ్ళీ పెరిగిపోతున్నాయి. తెలంగాణాలో యాక్టీవ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు విధించింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రజలు తప్పని సరిగా పాటించవల్సిన కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 10 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు తప్పనిసరి అయితేనే బయటికి వెళ్లాలి. 20 నుంచి 50 ఏళ్ల లోపు వారికి కరోనా ఎక్కువ సోకుతుందని వెల్లడైంది కాబట్టి, ఆయా వ్యక్తులు ఉద్యోగాలకు, ఉపాధికి, ఇతర […]

the-government-has-issued-guidelines-f
X

కరోనా పాజిటీవ్ కేసులు మళ్ళీ పెరిగిపోతున్నాయి. తెలంగాణాలో యాక్టీవ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు విధించింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రజలు తప్పని సరిగా పాటించవల్సిన కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

10 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు తప్పనిసరి అయితేనే బయటికి వెళ్లాలి.

20 నుంచి 50 ఏళ్ల లోపు వారికి కరోనా ఎక్కువ సోకుతుందని వెల్లడైంది కాబట్టి, ఆయా వ్యక్తులు ఉద్యోగాలకు, ఉపాధికి, ఇతర ముఖ్యమైన పనులకు బయటికి వెళ్లేటప్పుడు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంటి నుంచి బయటికి వెళ్లే ప్రతిసారి మాస్కులు ధరించాలి. కొవిడ్-19ను ఎదుర్కోవడంలో మాస్కులే మొట్టమొదటి పోరాట యోధులు.

మనిషికి మనిషికి మధ్య 6 అడుగుల కంటే ఎక్కువ భౌతిక దూరం పాటించడం అత్యావశ్యకం. ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు భౌతికదూరం తప్పనిసరి.

పనిచేసే స్థలాల్లో సబ్బులు, శానిటైజర్లు తప్పకుండా అందుబాటులో ఉంచాలి. చేతులు శుభ్రపరుచుకునేందుకు తగినంత స్థలం కూడా ఏర్పాటు చేయాలి. పనిచేసే చోట ఉద్యోగుల మధ్య భౌతికదూరం తప్పనిసరి.

అవసరం లేకుండా ప్రయాణాలు చేయరాదు. ఒకవేళ తప్పనిసరి అయితే మాస్కులు, శానిటైజర్లు దగ్గరుంచుకోవాలి. భౌతికదూరం పాటించాలి.

జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కులు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి ఫ్లూ, ఇన్ ఫ్లుయెంజా తరహా లక్షణాలు ఉంటే దయచేసి మీకు సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో తెలియజేయండి. ఆలస్యం చేయకుండా వైద్యసాయం పొందండి.

బీపీ, డయాబెటిస్, హృదయ సంబంధిత జబ్బులు ఉన్నవారు, దీర్ఘకాలంగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారు, క్యాన్సర్ బాధితులు, లేక ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలి. ఏదైనా వైద్య చికిత్స కోసం తప్ప ఇతరత్రా బయటికి రాకూడదు. వారు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

వాక్సినేషన్ రెండు డోసులు తీసుకోవాలి.

First Published:  22 Jun 2022 2:09 AM IST
Next Story