దమ్ముంటే నాపై కేసులుపెట్టండి -కేటీఆర్ సవాల్
దమ్ముంటే తన మీద కేసులు పెట్టాలని ఇంజినీర్లు, చిన్నా చితకా కార్మికులపై కాదంటూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రజల సౌకర్యంకోసం ఐడీపీఎల్ దగ్గర రోడ్డు వేస్తుంటే కేసులు పెట్టాలని కేంద్రమంత్రి ఆదేశాలిస్తున్నారు అని కేటీర్ మండిపడ్డారు. మంచి చేయరు చేస్తున్నవాళ్ళను అడ్డుకుంటారని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఆ కేంద్రమంత్రికి చేతనైతే కంటోన్మెంట్ తో సహా హైదరాబాద్ నుండి కరీంనగర్, రామగుండం, ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో రక్షణ రంగానికి […]
దమ్ముంటే తన మీద కేసులు పెట్టాలని ఇంజినీర్లు, చిన్నా చితకా కార్మికులపై కాదంటూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రజల సౌకర్యంకోసం ఐడీపీఎల్ దగ్గర రోడ్డు వేస్తుంటే కేసులు పెట్టాలని కేంద్రమంత్రి ఆదేశాలిస్తున్నారు అని కేటీర్ మండిపడ్డారు. మంచి చేయరు చేస్తున్నవాళ్ళను అడ్డుకుంటారని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఆ కేంద్రమంత్రికి చేతనైతే కంటోన్మెంట్ తో సహా హైదరాబాద్ నుండి కరీంనగర్, రామగుండం, ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో రక్షణ రంగానికి చెందిన భూములను మాకు అప్పజెప్పు. వాటిని కూడా అద్భుతంగా స్కైవేలు, ఫ్లై ఓవర్‌లు కట్టి హైదరాబాద్ అంటే భారతదేశంలోనే అద్భుతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న నగరంగా తీర్చిదిద్దే బాధ్యత మాది అని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ పరిధిలోని కైతలాపూర్ లో ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ‘’హైదరాబాద్ నగరంలో ఎల్‌బీనగర్ నుంచి కూకట్‌పల్లి వరకు, ఉప్పల్ నుంచి శేరిలింగంపల్లి వరకు ఎక్కడ చూసినా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, ఆర్‌వోబీలు, ఆర్‌యూబీలు అనేకం నిర్మించాము, రూ.8052కోట్లతో ఎస్సార్‌డీపీలో మొదటి దశ కింద 47 వివిధ కార్యకమాలు తీసుకున్నాము, గత 8 సంవత్సరాల్లో ప్రభుత్వం కట్టిన 30వ ఫ్లై ఓవర్ ఇది. ఇంకా 17 వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేసి ఈ సంవత్సరం ఆరు, మిగతా వాటిని వచ్చే సంవత్సరం హైదరాబాద్ ప్రజలకు కానుకగా అందించబోతున్నాం” అని తెలిపారు.
ఐడీపీఎల్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా వందల ఎకరాల భూములు ఇచ్చింది. ఐడీపీఎల్ ఏర్పడ్డప్పుడు అది ఊరవతల ఉండేది. ఇప్పుడు చుట్టూ మొత్తం అభివృద్ది చెంది హైదరాబాద్ మధ్యలోకి వచ్చింది. అక్కడ రోడ్లు కావాలని 70 ఏళ్ళుగా ప్రజలు అడుగుతుంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఇన్నాళ్ళకు మేము రోడ్డు వేస్తూ ఉంటే కేసులు పెట్టాలని కేంద్ర మంత్రి ఆదేశించడం సరైనదా అని కేటీఆర్ ప్రశ్నించారు