Telugu Global
NEWS

వైసీపీ నేత ఆమంచికి సీబీఐ నోటీసులు.. ఎందుకంటే..

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. బుధవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది ఆమంచిపై అభియోగం. ఇదివరకే ఒకసారి ఆమంచిని సీబీఐ విచారించింది. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. డాక్టర్‌ సుధాకర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించిన సమయంలో ఆమంచి కృష్ణమోహన్‌ కోర్టు తీర్పుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. సుధాకర్‌ కేసును సీబీఐకి అప్పగించడంతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. […]

CBI-issued-notice-YCP-leader-Amanchi-Krishna-Mohan
X

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. బుధవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది ఆమంచిపై అభియోగం. ఇదివరకే ఒకసారి ఆమంచిని సీబీఐ విచారించింది. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది.

డాక్టర్‌ సుధాకర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించిన సమయంలో ఆమంచి కృష్ణమోహన్‌ కోర్టు తీర్పుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. సుధాకర్‌ కేసును సీబీఐకి అప్పగించడంతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. ఇలాంటి కేసులన్నీ సీబీఐకి అప్పగిస్తే ఇక ప్రతి చోట సీబీఐ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి వస్తుందన్నారు.

కోర్టు తీర్పుపై ప్రజలంతా విస్తుపోయారని, ఇలాంటి తీర్పులతో న్యాయస్థానాలపై నమ్మకం పోతుందని.. ఇలాంటి తీర్పులు రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలన్నారు. కరోనా లేకపోతే తాను హైకోర్టు తీర్పున‌కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేసి ఉండేవాడినని కూడా అప్పట్లో ఆమంచి బహిరంగ సభలో వ్యాఖ్యలు చేశారు.

తొలిసారి విచారణకు పిలిచిన సమయంలో తాను న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, ఒక పౌరుడిగా తన అభిప్రాయం మాత్రమే చెప్పానని ఆమంచి వివరణ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇస్తూ బుధవారం ఉదయం 10.30 గంటలకు విజయవాడ సీబీఐ క్యాంపు కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది సీబీఐ. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌ కూడా అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

First Published:  21 Jun 2022 11:44 AM IST
Next Story