Telugu Global
NEWS

సికింద్రాబాద్ ఘ‌ట‌న‌పై మాన‌వ హ‌క్కుల సంఘం నోటీసులు

అగ్నిప‌థ్ కు వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా చెల‌రేగిన ఆగ్ర‌హ జ్వాల‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. సికింద్రాబాద్ లో జ‌రిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విష‌యం తెలిసిందే ఈ ఘ‌ట‌న‌లో రాకేష్ అనే యువ‌కుడు మ‌ర‌ణించ‌గా ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీనిపై మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) స్పందించింది. మీడియా కథనాలను హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఈ సంఘ‌ట‌న‌ల‌పై జులై 20 వ తేదీలోగా సమగ్ర నివేదిక ఇవ్వాల‌ని ఆర్పీఎఫ్, జీఆర్పీ, డీజీపీలను ఆదేశించింది. అగ్నిపథ్ ప‌థ‌కాన్ని వెనక్కి తీసుకోవాలంటూ […]

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
X

అగ్నిప‌థ్ కు వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా చెల‌రేగిన ఆగ్ర‌హ జ్వాల‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. సికింద్రాబాద్ లో జ‌రిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విష‌యం తెలిసిందే ఈ ఘ‌ట‌న‌లో రాకేష్ అనే యువ‌కుడు మ‌ర‌ణించ‌గా ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీనిపై మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) స్పందించింది. మీడియా కథనాలను హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఈ సంఘ‌ట‌న‌ల‌పై జులై 20 వ తేదీలోగా సమగ్ర నివేదిక ఇవ్వాల‌ని ఆర్పీఎఫ్, జీఆర్పీ, డీజీపీలను ఆదేశించింది.

అగ్నిపథ్ ప‌థ‌కాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ, నిరసనకారులు సికింద్రాబాద్ లో ఆందోళ‌న‌ల‌కు దిగారు. క్ర‌మంగా అది అదుపు త‌ప్పి విధ్వంసానికి దారితీసింది. పలు రైళ్లకు నిప్పుపెట్టారు. రైల్వే ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు దీంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. నిర‌స‌న‌కారులు విధ్వంసానికి దిగ‌డంతో పోలీసులు కాల్పులు జ‌ర‌పాల్సి వ‌చ్చింది.. ఈ కాల్పుల్లో 14 మంది గాయపడగా, వారిలో దామెర రాకేష్ అనే యువకుడు మరణించాడు. మిగిలిన వారు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

First Published:  19 Jun 2022 6:14 AM IST
Next Story