వెల్లంపల్లి వర్సెస్ జనసేన.. పాత కక్షలు భగ్గుమన్నాయ్..
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. గతంలో పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు.. అప్పట్లో మంత్రి హోదాలో ఉన్న వెల్లంపల్లిపై పవన్ కల్యాణ్ వేసిన సెటైర్లు అందరికీ తెలిసినవే. అయితే వెల్లంపల్లి మంత్రి పదవినుంచి దిగిపోయిన తర్వాత జనసేన వర్సెస్ వెల్లంపల్లి వార్ కాస్త తగ్గింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చే బాధ్యత తాజా మంత్రులు స్వీకరించడంతో వెల్లంపల్లి కాస్త వెనక్కి తగ్గిన పరిస్థితి. అయితే ఇప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో మళ్లీ […]
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. గతంలో పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు.. అప్పట్లో మంత్రి హోదాలో ఉన్న వెల్లంపల్లిపై పవన్ కల్యాణ్ వేసిన సెటైర్లు అందరికీ తెలిసినవే. అయితే వెల్లంపల్లి మంత్రి పదవినుంచి దిగిపోయిన తర్వాత జనసేన వర్సెస్ వెల్లంపల్లి వార్ కాస్త తగ్గింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చే బాధ్యత తాజా మంత్రులు స్వీకరించడంతో వెల్లంపల్లి కాస్త వెనక్కి తగ్గిన పరిస్థితి. అయితే ఇప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో మళ్లీ పాత కక్షలు భగ్గుమన్నాయి. నాగబాబు అనే యువకుడికి జనసేన నాయకులు సపోర్ట్ గా నిలిచారు.
జనసేనతో వెల్లంపల్లికి గొడవ ఏంటి..?
2009లో చిరంజీవి ప్రజారాజ్యం తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఒకరు. అప్పట్లో ఆయన తరపున పవన్ కల్యాణ్ కూడా విజయవాడలో ప్రచారం చేశారు. ఆ తర్వాత వెల్లంపల్లి 2014లో బీజేపీలో చేరి విజయవాడ పడమర నియోజకవర్గం నుంచి పోటీ చేయగా.. బీజేపీ, టీడీపీతో పొత్తులో ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ ఆయనకు ఓటు వేయాల్సిందిగా ఆ ఏడాది కూడా ప్రజలకు పిలుపునిచ్చారు. కట్ చేస్తే 2019లో వెల్లంపల్లి వైసీపీ అభ్యర్థి అయ్యారు. అక్కడినుంచి పవన్ కల్యాణ్ కి ఆయనకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన వెల్లంపల్లికి వెంటనే మంత్రి మండలిలో చోటు దక్కింది. ఆ తర్వాత మాటల తూటాలు మరింతగా పేలాయి. నేరుగా పవన్ కల్యాణ్, వెల్లంపల్లి ఒకరినొకరు పేరు పెట్టి విమర్శలు చేసుకునే పరిస్థితి వచ్చింది. దీంతో సహజంగానే జనసైనికులు సోషల్ మీడియాలో వెల్లంపల్లిని టార్గెట్ చేసి మాట్లాడేవారు.
ఇటీవల మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో వెల్లంపల్లి పదవికోల్పోయిన తర్వాత జనసేన కాస్త సైలెంట్ అయింది. అయితే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో మళ్లీ పాత గొడవలు బయటపడ్డాయి. నాగబాబు అనే యువకుడు మాజీ మంత్రి వెల్లంపల్లి అవినీతిపై ఆరోపణలు చేయడంతో.. అవి నిరూపించాల్సిందిగా, రుజువులు చూపించాల్సిందిగా పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కి పిలిపించారు. ఆ యువకుడికి అండగా జనసేన నాయకులు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అతడిని విడిపించుకుని తీసుకొచ్చారు. ప్రశ్నించే గొంతులను తొక్కిపెట్టాలని చూస్తే, అరెస్ట్ లతో అడ్డుకోవాలనుకుంటే.. ఏపీలో ఉన్న పోలీస్ స్టేషన్లు సరిపోవని హెచ్చరించారు. నాగబాబుకి తాము మద్దతుగా ఉంటామన్నారు. నాగబాబు ఏ పార్టీ కార్యకర్త, ఏ పార్టీ సానుభూతి పరుడు అనే విషయాన్ని పక్కనపెడితే.. ఈ వివాదంలోకి జనసేన ఎంటరైంది. వెల్లంపల్లిని మరోసారి జనసేన నాయకులు టార్గెట్ చేశారు.